iDreamPost

E-Challan Scam: పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్లు కడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే పెండిగగ్ లో చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించారు. దీనికి వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే పెండిగగ్ లో చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించారు. దీనికి వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది.

E-Challan Scam: పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్లు కడుతున్నారా?  తస్మాత్ జాగ్రత్త..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. అంతేకాదు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజల వద్దకే ప్రభుత్వం అంటూ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇదే క్రమంలో తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తుంది. అయితే దీన్ని కొంతమంది సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ‌లో భారీ ఎత్తున ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు పెరిగిపోయాయి.  పెండింగ్ చలాన్లు వసూళ్లు చేసేందుకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. తమ పెండింగ్ చలాన్లు కట్టేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్ లైన్ లో ట్రాఫిక్ బాగా పెరిగిపోవడంతో ఈ-చలాన్ వెబ్ సైట్ సర్వర్ డౌన్ అవుతుంది. దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది సైబర్ కేటుగాళ్ళు చెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్ సైట్లను తయారు చేసి వాహనాదారుల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అలర్ట్ అయిన పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టారు.  ఓ నకిలీ వెబ్ సైట్ గట్టు రట్టు చేశారు.  ఇలాంటి వెబ్ సైట్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.

సుమారు రెండు కోట్ల పెండింగ్ చలాన్లను క్లియర్ చేయించాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ ఆఫర్ ని తీసుకురాగా.. విశేష స్పందన వస్తుంది. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరుకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లను క్లోజ్ చేసుకునేందుకు వాహనదారులు మీ సేవలతో పాటు వెబ్ సైట్ ని ఓపెన్ చేసి చెల్లిస్తున్నారు. ఈ ఆఫర్ చలాన్లు కట్టేందుకు మీ సెవా సెంటర్లతో పాటు https://echallan.tspolice.gov.in/publicview వెబ్ సైట్‌ ద్వారా చెల్లించవొచ్చు అని తెలిపారు అధికారు. వాహనదారులు అధికంగా ఈ-చలాన్ వెబ్ సైట్ కి పోటెత్తడంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. గత రెండు రోజులగా ఇదే సమస్య తలెత్తుతుందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు అంటున్నారు. ఇదే ఇప్పుడు కొంతమంది సైబర్ నేరగాళ్లకు ప్లస్ పాయింట్ అవుతుంది. సైబర్ నేరగాళ్లు https ://echallantspolice.in/ పేరుతో నకిలీ చలాన్ వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది చెబులకు చిల్లలు పెడుతున్నారు. ఇలాంటి నకిలీ వెబ్ సైట్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి