iDreamPost

గుడ్ న్యూస్.. అంతర్జాతీయ స్థాయిల్లో ఆ వర్గాలకు ఉచితంగా ఫీజులు!

గుడ్ న్యూస్.. అంతర్జాతీయ స్థాయిల్లో ఆ వర్గాలకు ఉచితంగా ఫీజులు!

తెలంగాణ సీఎం కేసీఆర్  బీసీల అభ్యున్నతికి మరో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశ పెట్టనున్నారు. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ‘విదేశీ విద్యానిధి’ పథకాన్ని అమలు చేస్తున్న తరహాలోనే మరో కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టనున్నది. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అలానే ప్రతి వర్గానికి ఏదో ఒక స్కీమ్ ద్వారా ఆర్ధిక భరోసాను కల్పిస్తున్నారు. అలానే విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వివిధ పథకాల ద్వారా  ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.

బీసీల అభ్యున్నతి  కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశ పెట్టారు. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు  విదేశీ విద్యానిధి స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరోకొత్త పథకాన్ని ప్రారంభిచనున్నారు.  ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి దేశంలోని 200కు పైగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు పొందే ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులకు సంపూర్ణంగా ఫీజులను చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దీనికి సంబంధించిన వివరాలను మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం వెల్లడించారు.

మంగళవారం ఈ పథకంపై సచివాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. విధివిధానాలు రూపొందించాలని  అధికారులను ఆదేశించారు.  ఈ   సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ వర్గాలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం  పని చేస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ అవకాశం ఉండేది.  ఈ  ఏడాది నుంచి బీసీలకు కూడా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బీసీ విధ్యార్థులకు లబ్దీ చేకూరుతుందని, ఇందుకోసం అదనంగా ఏటా 150కోట్లను ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి కమలాకర్ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ…” ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్పులతో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియంబర్మెంట్ చెల్లిస్తున్నాము.  ఇక నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో కూడా బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు అందించనున్నాము. అంతేకాక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల్ని చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే. లక్షలాది బీసీ బిడ్డలకు నాణ్యమైన ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాలు వంటి ఏర్పాటు చేశాము. ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీ బిడ్డలకు కూడా ఫీజు అందించడం సంతోషంగా ఉంది” అని మంత్రి గంగుల అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసారు. బీసీ విద్యార్థుల కోసం కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బ్రేకింగ్: మరో రెండ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సర్కారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి