iDreamPost

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. మాజీ మంత్రులు, MLAలకు షాక్!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా మాజీల భద్రతను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా మాజీల భద్రతను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. మాజీ మంత్రులు, MLAలకు షాక్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఐపీఎస్ ల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా ఐఏఎస్ లకు స్థాన చలనం కల్పించి, పదోన్నతులు కల్పించింది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రత తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. మాజీలకున్న భద్రతను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్ మెన్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సర్కార్ ఆదేశాల నేపథ్యంలో వారి గన్ మెన్స్ ను పోలీస్ డిపార్ట్ మెంట్ విత్ డ్రా చేసింది. ఎవరెవరికీ భద్రతా పరంగా గన్ మెన్స్ అవసరం అనే అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు రివ్యూ చేయనున్నారు. ఆ రిపోర్టు అనంతరం ఆయా మంత్రులకు, ఎమ్మెల్యేలకు గన్ మెన్లను కేటాయించనున్నారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని పది లక్షలకు పెంచింది ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసింది రేవంత్ సర్కార్. వరుస సమీక్షా సమావేశాలతో సీఎం రేవంత్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రాయదుర్గం నుంచి శంశాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణను కూడా నిలిపి వేసి మరో సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ సర్కార్ మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రత తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి