iDreamPost

టానిక్ వైన్ మార్ట్ భారీ మోసం.. రూ. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!

టానిక్ వైన్ మార్ట్ భారీగా పన్ను ఎగవేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. దీంతో క్షణ్ణంగా కేసును పరిశీలిస్తున్న అధికారులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ఆ వివరాల్లోకి వెళితే..

టానిక్ వైన్ మార్ట్ భారీగా పన్ను ఎగవేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. దీంతో క్షణ్ణంగా కేసును పరిశీలిస్తున్న అధికారులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ఆ వివరాల్లోకి వెళితే..

టానిక్ వైన్ మార్ట్ భారీ మోసం.. రూ. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!

టానిక్ వైన్ మార్ట్.. హైదరాబాద్ మహానగరంలో ఈ పేరు తెలియని మందుబాబులు ఉండరు అంటే అతిశయోక్తికాదు. అయితే ఈ మార్ట్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు, ట్యాక్సులు ఎగవేతకు పాల్పడ్డట్లు విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. కొందరు అధికారులను ప్రసన్నం చేసుకుని రూ. వందల కోట్ల ట్యాక్సులు ఎగవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మార్టుకు చేసిన మరిన్ని మోసాలు తెలిస్తే.. మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం. పూర్తి వివరాల్లోకి వెళితే..

2016లో స్పెషల్ జీవో 271 పేరిట ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఈ జీవో ప్రకారం ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా మెుదటి మూడేళ్లు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లించనక్కర్లేదు. కాగా.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ వేసింది. దీంతో ఆ కంపెనీకే పర్మిషన్ సులువుగా వచ్చింది. ఇక్కడే ఓ ట్విస్టు ఉంది.

తెలంగాణ మెుత్తం మీద కేవలం ఒక్కటంటే ఒక్క ఎలైట్ ఔట్ లెట్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ టానిక్ సంస్థ మాత్రం హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో మరో 10 ఎలైట్ లిక్కర్ షాపులను ‘క్యూ బై టానిక్’ పేరుతో అక్రమంగా నిర్వహిస్తోంది. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే? అసలు ఈ లైసెన్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశమే లేదు. కానీ టానిక్ మాత్రం పేర్లు మార్చి విచ్చలవిడిగా దుకాణాలను తెరచింది. ఇక్కడి వరకు ఒకెత్తు మోసం అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయేది మరో ఎత్తు.

లూజ్ వైన్ అమ్మొద్దు. కూల్ డ్రింక్స్, ఆహారపదార్థాలు కూడా అందులో అమ్మకూడదు. విదేశీ మద్యం కూడా అమ్మడం ఇక్కడ కొసమెరుపు. అసలు వీటన్నింటికీ అనుమతులే లేవు. కానీ టానిక్ మార్ట్ మాత్రం దర్జాగా మద్యం విక్రయిస్తూ.. కోట్లకు కోట్లు లాభాలను అర్జిస్తోంది. అయినప్పటికీ.. రూ. 100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు సమాచారం. ఈ తతంగానికి కొందరు ప్రభుత్వ అధికారులు సాయం చేసినట్లు, సీఎంవో మాజీ అధికారి కూడా ఉన్నట్లు వారి పాత్రలపై అధికారలు ఆరాతీస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో టానిక్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది. ఇంతకు ముందు అమ్మినట్లుగా అర్ధరాత్రి 2 గంటల వరకు లిక్కర్ అమ్మకూడదని, రెగ్యూలర్ షాపులు అమ్మినట్లుగా రాత్రి 11 గంటల వరకే అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. మరి టానిక్ మార్ట్ చేసిన మోసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో కూల్చివేతలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి