iDreamPost

రూ.1కే 4 గ్యాస్ సిలిండర్లు.. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీ హామీ!

  • Author singhj Published - 12:41 PM, Sat - 11 November 23

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక ప్రధాన పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో ఒక్క రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపింది.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక ప్రధాన పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో ఒక్క రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపింది.

  • Author singhj Published - 12:41 PM, Sat - 11 November 23
రూ.1కే 4 గ్యాస్ సిలిండర్లు.. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీ హామీ!

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపించడం మామూలే. ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు పార్టీలు హామీల మీద హామీలు ఇస్తూ పోతాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు 1,100కు పైగా క్యాండిడేట్స్ బరిలోకి దిగుతున్నారు. అధికార బీఆర్ఎస్​తో పాటు బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అదే టైమ్​లో పలు చిన్నాచితకా పార్టీల నుంచి కొందరు, ఇండిపెండెంట్లుగా మరికొందరు బరిలోకి దిగుతున్నారు.

ఎలక్షన్స్​లో విజయమే టార్గెట్​గా అన్ని పార్టీల అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో కూడిన మేనిఫెస్టోను పార్టీలు రిలీజ్ చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ సామాన్యులు, మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకునేలా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రూ.400కే సిలిండర్ ఇస్తామని బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే ఒక నేషనల్ పార్టీ మాత్రం గ్యాస్ సిలిండర్ల మీద సంచలన ప్రకటన చేసింది. ఒకవేళ తాము పవర్​లోకి వస్తే ఏకంగా రూ.1కే నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్ ఈ హామీ ఇచ్చారు.

సనత్​నగర్ నుంచి పోటీ చేస్తున్న కుమ్మరి వెంకటేష్.. ఆ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల మనసులు గెలుచుకునేందుకు ఇంటింటా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే రూపాయికే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని వెంకటేష్ ప్రకటించారు. అంతేగాక రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలు ఇస్తానని హామీలు ఇచ్చారాయన. ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రతి 100 ఫ్యామిలీలకు ఒక వాలంటీర్​ను నియమిస్తామని చెప్పారు. అలాగే 70 ఏళ్ల వయసు దాటిన వృద్ధులకు పానిక్ బటన్ నొక్కగానే వాలంటీర్లు వచ్చి సాయం అందించేలా చేస్తామంటూ వెంకటేష్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. మరి.. రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు అందిస్తానంటూ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి ప్రచారం చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏ చిన్న చెడ్డ అలవాటు లేకపోయినా.. చంద్రమోహన్ రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడని మీకు తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి