iDreamPost

మహిళలకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 2,500పై కీలక అప్ డేట్!

రేవంత్ సర్కార్ మహిళలకోసం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఎన్నికల ముందు కేబినెట్ సమావేశం జరుగనుండడంతో ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో మహిళలకు నెలకు రూ. 2500పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎస్ హెచ్ జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పునరుద్దరణ, రూ. 5 లక్షల జీవితబీమాపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచాం. ఇప్పటికే 2500 ఆర్థిక సాయంపై రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఇవాల్టి కేబినెట్ భేటీలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనున్నది. త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగనున్న నేపథ్యంలో ఈ మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహిళలకు నెలకు రూ. 2500 తో పాటు, రేషన్ కార్డులు, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నాయి సంబంధిత వర్గాలు. వంద రోజుల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేసి తీరుతమని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గడువులోగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి