iDreamPost

BJP మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల.. బాబు మోహన్ కు చోటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది.

BJP మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల.. బాబు మోహన్ కు చోటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ ఎస్ తో పాటు జాతీయ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. మేనిఫేస్టోలను కూడా ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించారు. నియోజక వర్గాల్లో లీడర్లు కలియతిరుగుతూ ప్రజలతో మమేకమై పోతున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో నేడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. కాగా ఈ జాబితాలో ఊహించని పేర్లు ఉండడం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 35 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఇది వరకే మొదటి, రెండవ జాబితాలను విడుదల చేసిన బీజేపీ తాజాగా మూడో జాబితాను కూడా విడుదల చేసింది. ఆ రెండు జాబితాల్లో కలిపి 53 మంది పేర్లను బీజేపీ విడుదల చేసింది. మూడో జాబితాతో ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. కాగా ఇంకా 31 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ జాబితాలో మూడు ఎస్టీ, ఐదు ఎస్సీ నియోజక వర్గాల అభ్యర్థులు ప్రకటించగా.. జాబితాలో ఒక మహిళకు చోటు కల్పించారు. అయితే మూడో జాబితాలో నటుడు బాబు మోహన్ కు కూడా చోటు కల్పించారు. కొద్ది రోజుల క్రితం అసంతృప్తిలో ఉన్న ఆయన ఎన్నికల్లో పోటీచేయనని.. బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం అసంతృప్తిలో ఉన్న బీజెపీ నేత, సినీ నటుడు బాబు మెహన్ బీజేపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుండి బాబు మోహన్, ఆయన కుమారుడు పోటీ చేస్తున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. బీజెపీ కొత్త, పాత అధ్యక్షులు ఇద్దరికీ ఎన్నో ఫోన్లు చేశానని, వారిద్దరూ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని అన్నారు. ఫస్ట్ లిస్ట్ లో తన పేరు లేదని చెప్పారు. ఎందుకు లేదో తెలియదని, ఆ దాపరికాలు ఎందుకో అంటూ ప్రశ్నించారు. బీజెపీ పెద్దలు మీకు విన్నవించేది ఒక్కటే..ఈ సారి నేను పోటీ చేయదల్చుకోలేదని అన్నారు. పార్టీకి దూరంగా ఉంటానని, ప్రచారం కూడా చేయనని చెప్పారు. పార్టీ పెద్దలు స్పందించే దాన్ని బట్టి బీజెపీలో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అనూహ్యంగా ఇప్పుడు మూడో జాబితాలో బాబు మోహన్ కు చోటు కల్పించడంతో చర్చనీయాంశంగా మారింది.

మూడో జాబితాలోని ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
ఎల్బీనగర్‌ – సామ రంగారెడ్డి
రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి
అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌
జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి
సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి
సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి
చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం
పరిగి – బోనేటి మారుతి కిరణ్‌
ముషీరాబాద్‌ – పోస రాజు
బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి
మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌
బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి
మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
అందోల్‌ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్‌
జహీరాబాద్‌ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా
మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌
నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప
పరకాల – కాలి ప్రసాద్‌రావు
పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు
పాలేరు – నున్న రవికుమార్‌
సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు
నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి
జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌
మక్తల్‌ – జలంధర్‌రెడ్డి
వనపర్తి – అశ్వత్థామరెడ్డి
అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్‌ మాదిగ
షాద్‌నగర్‌ – అండె బాబయ్య
దేవరకొండ (ఎస్టీ)- కేతావత్‌ లాలూ నాయక్‌
హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి
నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌
ఆలేరు – పడాల శ్రీనివాస్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి