iDreamPost

రేపే పదో తరగతి ఫలితాలు.. ఎన్ని గంటలకు విడుదల చేస్తారంటే?

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. ఎన్నికల సంఘం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇంతకు ఎప్పుడు రాబోతున్నాయంటే..?

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. ఎన్నికల సంఘం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇంతకు ఎప్పుడు రాబోతున్నాయంటే..?

రేపే పదో తరగతి ఫలితాలు.. ఎన్ని గంటలకు విడుదల చేస్తారంటే?

పరీక్షలు ముగిసి.. ఫలితాల సమయం ఆసన్నమైంది. పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, టెన్త్ ఫలితాలు వడివడిగా విడుదలౌతున్నాయి. ఏపీలో పది, ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయ్. తెలంగాణలో కూడా ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన సంగతి విదితమే. ఇప్పుడు పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అవుతుంది. ఈ రిజల్ట్స్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్శదర్శి బుర్రా వెంకటేశం కీలక ప్రకటన చేశారు. ఫలితాల తేదీని, సమయాన్ని వెల్లడించారు.  ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఈ నెల మంగళవారం ఉదయం 11 గంటలకు పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు వెంకటేశం. ఆన్ లైన్‌లో ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. గత ఏడాది పేపర్ లీక్ కలకలం సృష్టించిన సంగతి విదితమే. ఈ సారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. సవ్యంగా, సజావుగా పరీక్షలు ముగిశాయి. మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,50,433 మంది బాలికలు… 2,57,952 మంది బాలురు పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు కాస్త ఆలస్యంగా విడుదలౌతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదో తరగతి ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు. కాగా, ఫలితాలు విడుదల అవుతున్న నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ మళ్లీ ఎగ్జామ్స్ రాసుకునేందుకు మరో అవకాశం ఉందని, పిల్లల్లో మనో ధైర్యాన్ని నింపాలని సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఫలితాల విషయంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి