iDreamPost

Team India: టీమిండియాలో అతడు ఉన్నా లేనట్లే.. ఎందుకు ఆడిస్తున్నట్లు?

  • Published Jan 06, 2024 | 5:53 PMUpdated Jan 06, 2024 | 6:03 PM

ఒక టీమిండియా ప్లేయర్ మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అతడు జట్టులో ఉన్నా లేనట్లేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఎవరా ఆటగాడు? ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నాడో ఇప్పుడ చూద్దాం..

ఒక టీమిండియా ప్లేయర్ మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అతడు జట్టులో ఉన్నా లేనట్లేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఎవరా ఆటగాడు? ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నాడో ఇప్పుడ చూద్దాం..

  • Published Jan 06, 2024 | 5:53 PMUpdated Jan 06, 2024 | 6:03 PM
Team India: టీమిండియాలో అతడు ఉన్నా లేనట్లే.. ఎందుకు ఆడిస్తున్నట్లు?

క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ తమ నేషనల్ టీమ్​కు ఒక్కసారైనా ఆడాలని కోరుకుంటారు. అందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే వారిలో ఏ కొందరికో మాత్రమే అవకాశం లభిస్తుంది. ఛాన్సులు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకొని టీమ్​లో సెటిల్ అయ్యేవారు తక్కువే. కానీ కొందరు మాత్రం తమకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకొని రెగ్యులర్​ ప్లేయర్స్​గా మారతారు. అయితే కెరీర్​ను సుదీర్ఘ కాలం పొడిగించుకోవాలంటే కంటిన్యూస్​గా పెర్ఫార్మ్ చేయాలి. అప్పుడే బెస్ట్ ప్లేయర్​గా పేరు తెచ్చుకోవచ్చు. ప్రస్తుత టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ కేటగిరీలోకే వస్తారు. దశాబ్దంన్నర కాలంగా వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడుతూ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే వీళ్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బలమైన ప్లేయర్లు కనిపించడం లేదు. కొందరికి వరుసగా ఛాన్సులు ఇస్తున్నా విఫలమవుతున్నారు. అందులో ఒకడు శ్రేయస్ అయ్యర్.

ఈ మధ్య కాలంలో టీమిండియాలో ఎక్కువ అవకాశాలు అందుకున్న ప్లేయర్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ ఈ స్టైలిష్ బ్యాటర్​కు వరుస ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది టీమ్ మేనేజ్​మెంట్. అయ్యర్ కూడా తనకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని రాణిస్తున్నాడు. రీసెంట్​గా జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో సూపర్బ్​గా పెర్ఫార్మ్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్వదేశీ పిచ్​లపై తప్ప విదేశాల్లో అయ్యర్ సరిగ్గా ఆడట్లేదు. ఎక్స్​ట్రా పేస్, అనూహ్యమైన బౌన్స్ ఉండే ఫారెన్ పిచ్​ల్లో అట్లర్ ఫ్లాప్ అవుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతడి రికార్డు ఏమంత బాగోలేదు. ఇప్పటిదాకా 12 టెస్టులు ఆడిన అయ్యర్.. 20 ఇన్నింగ్స్​ల్లో కలిపి 707 పరుగులు చేశాడు. వీటిలో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.

సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో అయ్యర్ దారుణంగా ఫెయిలయ్యాడు. ఈ సిరీస్​లో అతడి స్కోర్లు ఇలా ఉన్నాయి.. 31, 6, 0, 4. అయ్యర్ షార్ట్ బాల్ వీక్​నెస్​ను ప్రత్యర్థి బౌలర్లు టార్గెట్​ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. వరల్డ్ కప్​లో దీని నుంచి కాస్త బయటపడినట్లు కనిపించాడు గానీ ఆ షాట్స్ మీద ఇంకా పూర్తి పట్టు సాధించలేదు. ఎక్స్​ట్రా పేస్​, స్వింగ్​తో వచ్చే బంతుల్ని ఎదుర్కోవడంలోనూ అతడు తడబడుతున్నాడు. ఇప్పుడిప్పుడే వన్డేలు, టీ20ల్లో సెటిల్ అవుతున్న అయ్యర్​ను తీసుకొచ్చి విదేశాల్లో ఆడించడం కరెక్ట్ కాదు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో కంటిన్యూస్​గా పెర్ఫార్మ్ చేస్తే అప్పుడు టెస్టుల్లోకి తీసుకొస్తే మంచి ఫలితం ఉంటుంది. స్పిన్ బాగా ఆడతాడని లాంగ్ ఫార్మాట్​లో ఆడిస్తున్నారు.. కానీ అక్కడ పేసర్లకు దొరికిపోతున్నాడు. అతడ్ని టెస్టుల్లో ఎందుకు ఆడిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీమ్​లో అయ్యర్ ఉన్నా లేనట్లేనని.. అతడు అవసరమా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడి ప్లేస్​లో పుజారా, రహానె లాంటి సీనియర్లను తీసుకోవాలని లేదా ఇతర యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. మరి.. టీమ్​లో అయ్యర్ అవసరం లేదంటూ వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: పుజారా సెంచరీ.. సూపర్బ్ నాక్​తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నయా వాల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి