iDreamPost

VIDEO: తొలి మ్యాచ్‌ ఆడుతూ.. వెక్కి వెక్కి ఏడ్చిన టీమిండియా క్రికెటర్‌

  • Author Soma Sekhar Published - 11:11 AM, Tue - 3 October 23
  • Author Soma Sekhar Published - 11:11 AM, Tue - 3 October 23
VIDEO: తొలి మ్యాచ్‌ ఆడుతూ.. వెక్కి వెక్కి ఏడ్చిన టీమిండియా క్రికెటర్‌

ప్రతీ వ్యక్తికి ఓ కల ఉంటుంది. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అన్ని కష్టాలను దాటుకుని వచ్చి.. విజయం సాధిస్తే వచ్చే కిక్కేవేరు. ప్రస్తుతం ఇలాంటి కిక్కునే ఆనందబాష్పాల రూపంలో తెలియజేశాడు టీమిండియా యువ క్రికెటర్. కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతూ.. వెక్కి వెక్కి ఏడ్చాడు భారత యంగ్ క్రికెటర్. ఏషియన్ గేమ్స్ లో భాగంగా.. నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు తమిళనాడు కు చెందిన రవి శ్రీనివాసన్ సాయి కిశోర్. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సాయి కిశోర్ తన కల సాకరమైన వేళ వెక్కి వెక్కి ఏడ్చాడు.

రవి శ్రీనివాసన్ సాయి కిశోర్.. తమిళనాడుకు చెందిన క్రికెటర్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే తనకు పెద్దగా ఆడే అవకాశాలు రానప్పటికీ.. వచ్చిన ఛాన్స్ లను వాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఏషియన్ గేమ్స్ లో పాల్గొనబోయే టీమిండియా జట్టుకు ఎంపికైయ్యాడు సాయి కిశోర్. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన ఇతడు.. ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కాగా.. తన చిరకాల స్వప్నం నెరవేరడంతో.. వెక్కి వెక్కి ఏడ్చాడు ఈ ఆటగాడు.

నేపాల్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు గ్రౌండ్ లో తమ దేశ జాతీయ గీతాలు ఆలపించాయి. ఈ క్రమంలోనే ఇండియా జాతీయ గీతం పాడుతున్నప్పుడు సాయి కిశోర్ గుక్క పట్టి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సాయి కిశోర్ ఐపీఎల్ లో 5 మ్యాచ్ లు ఆడి.. 6 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా అటు ఐపీఎల్ లోకి ఇటు టీమిండియాలోకి దూసుకొచ్చాడు రవి శ్రీనివాసన్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో యువ ఓపెనర్ జైస్వాల్ అద్భుత శతకంతో కదం తొక్కాడు. 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 100 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో రింకూ సింగ్ కేవలం 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి.. 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టులో దీపేంద్ర సింగ్ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, అర్షదీప్ సింగ్ 2, రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా.. అరంగేట్ర ఆటగాడు రవి శ్రీనివాసన్ సాయి కిశోర్ పొదుపుగా బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి