iDreamPost

IND vs SA: తొలి టెస్ట్ లో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే!

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సఫారీ టీమ్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని 3 ప్రధాన కారణాలు శాసించాయి. మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సఫారీ టీమ్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని 3 ప్రధాన కారణాలు శాసించాయి. మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

IND vs SA: తొలి టెస్ట్ లో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే!

సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో తొలి టెస్ట్ లో విజయం సాధించింది సఫారీ టీమ్. దీంతో ప్రతిష్టాత్మకమైన బాక్సింగ్ డే టెస్టు ముచ్చటగా మూడు రోజుల్లోనే ముగిసింది. ప్రపంచంలోనే పటిష్ట బ్యాటింగ్ లైనప్ గా పేరుగాంచిన టీమిండియా.. ప్రోటీస్ బౌలర్ల ముందు చేతులెత్తేసింది. దీంతో నయా హిస్టరి క్రియేట్ చేయాలనుకున్న భారత్ కు చేదుఅనుభవమే ఎదురైంది. కాగా.. ఈ విజయంతో సౌతాఫ్రికా జట్టు రెండు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని 3 ప్రధాన కారణాలు శాసించాయి. మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సఫారీ టీమ్ విజయం సాధించింది. మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 256/5తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో సౌతాఫ్రికాకు 163 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కేవలం 131 రన్స్ కే కుప్పకూలింది. జట్టులో కోహ్లీ ఒక్కడే 76 పరుగులతో రాణించాడు. బర్గర్ 4, జాన్సన్ 3 వికెట్లతో సత్తాచాటారు.

టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు

1. బ్యాటింగ్ వైఫల్యం

ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుగా టీమిండియాకు గొప్ప పేరుంది. కానీ అది సౌతాఫ్రికా గడ్డపైకి వచ్చే సరికి మాత్రం రివర్స్ లో ఉంది. సఫారీ పేస్ పిచ్ లపై అనుభవం ఉన్న ఆటగాళ్లే బోల్తా కొట్టేవారు. దీంతో ఈసారి వెళ్లే జట్టు ఏం చేస్తుందా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనుకున్నదే జరిగింది.. ప్రోటీస్ పేస్ పిచ్ లపై సౌతాఫ్రికా పేస్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసి, మ్యాచ్ ను ప్రత్యర్థి టీమ్ కు అప్పగించింది. తొలి ఇన్నింగ్స్ లో పర్వాలేదనిపించిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ మినహా మిగతా బ్యాటర్లు కొంచెం కూడా ప్రభావం చూపలేకపోయారు. అవకాశం ఇచ్చిన యంగ్ ప్లేయర్లు ఘోరంగా విఫలం అయ్యారు. టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో బ్యాటింగ్ వైఫల్యం ముందుంటుంది.

2. బౌలింగ్

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో పిచ్ కాస్త కఠినంగా ఉందని అందరికి అర్ధమైంది. పైగా గత కొన్ని రోజులుగా అక్కడ వర్షం కురిసింది. దీంతో భారత బౌలర్లు చెలరేగడం ఖాయం అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా టీమిండియా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు డీన్ ఎల్గర్. మారథాన్ ఇన్నింగ్స్ ఆడి 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో.. సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగుల భారీ స్కోర్ కు ఆలౌట్ అయ్యింది. బుమ్రా 4 వికెట్లతో సత్తా చాటినప్పటికీ.. షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. యువ పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఏ మాత్రం ఆధిపత్యం చూపించలేకపోయారు. మ్యాచ్ ప్రారంభంలో త్వరగానే వికెట్లు తీసినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయారు. వారి జోరుకు డీన్ ఎల్గర్ అడ్డుకట్టవేశాడు.

3. టాస్

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో టాస్ లు కీలక పాత్ర పోషిస్తాయని మనందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. టీమిండియా టాస్ ఓడిపోవడం కీలక అంశం. ఎందుకంటే సెంచూరియన్ లో మ్యాచ్ కు ముందు వర్షం పడ్డ సంగతి తెలిసిందే. దీంతో టాస్ ఏ జట్టు గెలిస్తే ఆ టీమ్ బౌలింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే? పిచ్ పై ఉన్న తేమను, స్వింగ్ ను ఉపయోగించుకుంటూ.. బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావొచ్చు. పైగా సఫారీ పిచ్ లు పేస్ కు బాగా అనుకూలిస్తాయన్న పేరుకూడా ఉండనే ఉంది. ఇదే నిజం చేస్తూ.. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ ను సద్వినియోగం చేసుకుంటూ.. భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే కట్టడం చేయడం కాకుండా.. రెండో ఇన్నింగ్స్ లో దారుణంగా తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు పంపారు. అదీకాక టాస్ ఓడిపోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అప్పుడే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మరి టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగులతో ఓడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి