iDreamPost

TDPకి బిగ్ షాక్.. 40 ఏళ్ల బంధానికి గుడ్‌బై!

తెలంగాణ లో ఎన్నికల నగరా మోగింది. అధికార పార్టీ సహ ఇతర పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నాయి. షెడ్యూల్ వెలువడిన తర్వాత వలసల పర్వం కొనసాగుతుంది. మరోవైపు అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు సీనియర్ నేతలు.

తెలంగాణ లో ఎన్నికల నగరా మోగింది. అధికార పార్టీ సహ ఇతర పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నాయి. షెడ్యూల్ వెలువడిన తర్వాత వలసల పర్వం కొనసాగుతుంది. మరోవైపు అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు సీనియర్ నేతలు.

TDPకి బిగ్ షాక్.. 40 ఏళ్ల బంధానికి గుడ్‌బై!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాల్లో కీలక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కని వారు, ఆశించిన సీట్లు దక్కని వారు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి పలు వలసలు మొదలయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ దాదాపు కనిపించకుండా పోయిందని అంటారు. ఇక్కడ ముఖ్యనేతలు అధికార పార్టీ, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. తాజాగా తెలంగాణలో టీడీపీతో నలభై సంవత్సరాల అనుబంధం ఉన్న సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.. ఈసారి టికెట్ ఆశిస్తున్నా వారు తమకు ప్రాధాన్యత లేని పార్టీలకు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో జాయిన్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ ఎన్ని షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటి నుంచి వలసల పర్వం బాగా పెరిగిపోయింది. తాజాగా తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన టీడీపీకి సేవలందిస్తున్నారు. గత కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడి గులాబీ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

ఇక రావుల చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానాయపల్లి గ్రామ సర్పంచ్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 1982 లో సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగానికి ఆకర్షితులై టీడీపీలో చేరారు. టీడీపీ పార్టీలో చేరిన తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ కీలక సభ్యుడిగా ఎదిగారు. 1989 నుంచి 1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. 1994 లో వనపర్తి నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 2001లో రాజ్యసభ సభ్యునిగా టీడీపీ నామినెట్ చేసింది. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పార్టీతో సహ ఇతర పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయి.. కానీ ఆయన మాత్రం చంద్రబాబు కి ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పోటీకి దూరంగా ఉంటూ టీడీపీ జాతీయ పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీన పడిపోయింది.. తన సహచరులు ఎల్ రమణ, ఎర్రబెల్లి లాంటి కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో కొనసాగడం అనవసరం అని భావించారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ తీర్థం పుచుకునేందుకు సిద్దమయ్యారు. దీంతో రావుల టీడీపీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి