iDreamPost

బెడిసికొడుతున్న టిడిపి పెద్దల జూమ్ కాన్ఫరెన్సులు

బెడిసికొడుతున్న టిడిపి పెద్దల జూమ్ కాన్ఫరెన్సులు

తెలుగుదేశంపార్టీ నాయకత్వం నిర్వహిస్తున్న జూమ్ కాన్ఫరెన్సులు రోజు రోజుకు కామెడిగా తయారవుతున్నాయి. ఆచరణ సాధ్యం కాని కార్యక్రమాలపై చర్చలు జరిపే నెపంతో చంద్రబాబునాయుడుతో పాటు విడిగా టిడిపి నాయకులూ రెగ్యులర్ గా జూమ్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటిదే మరో కాన్ఫరెన్సు కూడా కామెడిగా నిలిచిపోవటమే కాకుండా బెడిసికొట్టింది.

ఇంతకీ విషయం ఏమిటంటే మద్యం దుకాణాలు తెరవటంపై చంద్రబాబు రెండో నాల్కల ధోరణితో మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై టిడిపి నేతలు టిడి జనార్ధన్, మాల్యాద్రి, మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సోమవారం పార్టీలోని మహిళా నేతలతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంతకీ విషయం ఏమిటంటే మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ధర్నా చేయటం గురించి చర్చించేందుకు సమావేశం నిర్వహించారు.

సమావేశం అయితే నిర్వహించారు కానీ ధర్నా ఎలా చేయాలి ? ఎక్కడ చేయాలి ? నేతలంతా ఎక్కడ జమవ్వాలి ? అనే విషయాల్లో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా ఎవరు ఇళ్ళల్లో నుండి బయటకు రావటం లేదు. ఎవరూ ఇళ్ళల్లో నుండి బయటకు రానపుడు ఇక ధర్న ఎలా చేయాలి ? అన్న విషయంపైనే పెద్ద చర్చ జరిగింది. మొత్తానికి టిడిపి పెద్దలంతా కలిసి ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చుని ధర్నా చేయాలని తీర్మానించారు. అయితే దీన్ని కొందరు నేతలు అభ్యంతరం చెప్పారట. ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చునేపాటికి ఇక ధర్నా ఎందుకు ? ఇపుడు చేస్తున్నది కూడా అదే కదా ? అని అడిగేసరికి ఏమి సమాధానం చెప్పాలో నేతలకు అర్ధం కాలేదు.

సరే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ధర్నాలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కొందరు నేతలు మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంతో కేసులు పెట్టి రిమాండ్ కు పంపితే ఏమి చేయాలి ? అని అడిగినపుడు పెద్దలు ఏమీ మాట్లాడలేకపోయారట. అదే సందర్భంగా మద్యానికి వ్యతిరేకంగా ధర్నా చేయాల్సిన అవసరం ఏమిటి ? అనే చర్చ కూడా వచ్చిందట. అసలు చాలా చోట్ల అమ్మాయిలు, ఆడవాళ్ళే క్యూలైన్లలో నిలబడి మద్యం కొంటున్నపుడు ఇక మనం ధర్నా ఎందుకు చేయాలి ? అనే ప్రశ్నకు కూడా పెద్దల నుండి సమాధానం రాలేదు.

సరే మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ధర్నా అనే చర్చపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగించేశారనుకోండి అది వేరే సంగతి. మొత్తానికి ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏదో ఓ రకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని చెప్పించాలని టిడిపి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలోనే బెడిసికొడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి