iDreamPost

బైటపడుతున్న ‘బరి తెగింపు’

బైటపడుతున్న ‘బరి తెగింపు’

అధికారమే అడ్డాగా టీడీపీ నాయకులు చెలరేగిపోయారని దాదాపు అన్ని రాజకీయపక్షాలు గొంతుచించుకుని అరిచి గోలపెట్టేసేవి. కానీ అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టమొచ్చిన రీతిలో ఆపార్టీనాయకులు వ్యవరించారు. తమపై ఈగ కూడా వాలకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు, ఫోర్త్‌ ఎస్టేట్‌ను కూడా ఉపయోగించుకునేవారు. అయితే కాలం మారింది.. దాంతోపాటే ప్రభుత్వమూ మారింది. ఇప్పుడు ఒకొక్క బరితెగింపు బైటపడుతున్నాయి. బైటపడే ఒక్కో అక్రమం వెనుక ఒక్కోకథ ఉంటోంది. ప్రభుత్వం ఎదురుదాడి చేద్దామన్నాగానీ తాము అధికారంలో ఉండగా చేసిన అతిక్రమణలు ఇప్పుడా పార్టీ నాయకులు అడ్డొచ్చేస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో మొదటి స్థానంలో నిలిచే సత్తా ఉన్నది విశాఖకే. అక్కడ టీడీపీకి కంచుకోటేనని ఇప్పటి వరకు వచ్చిన అనేక ఎన్నికల ఫలితాలు తేల్చి చూపాయి. అయితే ఈ కంచుకోటను అడ్డుగా పెట్టుకునే టీడీపీ నాయకులు ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల చుట్టూ అప్పనంగా కంచెలు కట్టేసుకున్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు. తద్వారా ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసారనే చెప్పాలి.

ఇప్పుడు జగన్‌ ప్రభుత్వంలో అదరు ఆక్రమణలన్నీ ఛేధిస్తుండడం విశాఖవాసుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ భూమిగా చెప్పిన అనేక ఖాళీ స్థలాలు పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయాయని విశాఖవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడేందుకు స్పెషల్‌డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు వెలుగులోకొచ్చాయి. ఇవన్నీ కూడా అక్రమించుకోవడం గానీ, లీజుకాలం పూర్తయ్యాక కూడా ఖాళీ చేయకపోవడవ తదితర కేటగిరీలుగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు అధికారులు దగ్గరుండి ఖాళీ చేస్తుండడంతో ప్రభుత్వానికి వందల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ సిద్ధమవుతోంది.

గతకొద్ది రోజుల్లోనే ఇన్ని వందల కోట్ల భూమి వెలుగులోకొస్తే.. ఇంకాస్త లోతుకువెళ్ళి విచారణలు జరిపితే ఇంకెంత ప్రభుత్వ భూమి బైటపడుతుందోనని విశాఖవాసులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆక్రమణదారులు మొత్తం గత ప్రభుత్వ హాయంలో చక్రం తిప్పివారే కావడం గమనార్హం. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఈ అక్రమణలకు సమాధానం చెప్పి ముందుకు రావాలని అధికార పక్షం నాయకులు సవాల్‌ కూడా విసురుతున్నారు.

గతంలో రకరకాల లాబీయింగ్‌లలో సిద్ధహస్తులుగా ఉన్న టీడీపీ నాయకులు పప్పులేమీ ఇప్పుడు ఉడక్కపోవడంతో అక్రమణదారులుగా బైటపడ్డవారంతా ఇప్పుడు ష్‌గచ్‌చుప్‌ అంటున్నారు. ఎక్కడా ఎటువంటి అలికిడీ కన్పించడం లేదట. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేయడంతో మరిన్ని ఆక్రమణలు బైటపెట్టేందుకు అధికారుంలు చురుగ్గానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకెన్ని ఎకరాల భూమలు వెలుగులోకి రానున్నాయి వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి