iDreamPost

గురజాల నియోజక వర్గంలో టీడీపీ మాజీ సర్పంచ్ హత్య ముద్దాయిలు ఎవరు ?.

గురజాల నియోజక వర్గంలో టీడీపీ మాజీ సర్పంచ్ హత్య ముద్దాయిలు ఎవరు ?.

గత ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు టీడీపీ నేత పురంశెట్టి అంకుల్ దారుణ హత్యకి గురి కావడం తెలిసిందే . గురజాల నియోజక వర్గ టీడీపీ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు దగ్గరి వ్యక్తిగా పేరున్న పురంశెట్టి అంకుల్ పెదగార్లపాడు గ్రామానికి పదేళ్ల పాటు సర్పంచ్ గా వ్యవహరించారు . ఆయన సతీమణి ఐదేళ్లు సర్పంచ్ పదవి నిర్వహించగా , ఇటీవల కాలంలో కొడుకు కూడా టీడీపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు .

సుదీర్ఘ కాలం నుండి రాజకీయాల్లో కొనసాగుతున్న అంకుల్ కి పెద్దగా రాజకీయ వివాదాలు లేవు కానీ , ఆర్ధిక , రియల్ ఎస్టేట్ సంబంధాలు ఎక్కువే . గతంలో దాచేపల్లి ప్రాంతంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి స్థల సేకరణలో ఇబ్బందులు తలెత్తితే భూసేకరణ వ్యవహారం మొత్తం అంకులే నడిపాడు అని దాచేపల్లి ప్రజలు ఇప్పటికీ అనుకొంటుంటారు . టీడీపీ హయాంలో రియల్ ఎస్టేటు లావాదేవీలు జోరుగా చేసిన కాలంలో కొందరు భాగస్వాములతో కలిసి నిర్మించ తలపెట్టిన ఒక అపార్ట్మెంట్ నిర్మాణం మాత్రం మధ్యలో ఆగిపోయింది . ఈ విషయంగా భాగస్వాములతో విబేధాలు ఉన్నాయని సన్నిహితులు అంటుంటారు . గత ఆదివారం రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత పెదగార్లపాడు నుండి దాచేపల్లిలోని ఈ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లిన అంకులు

డ్రైవర్ ని కారు వద్ద ఉంచి అపార్ట్మెంట్ లోకి ఒక్కడే వెళ్లారు . ఎంతసేపటికీ అంకులు తిరిగి రాకపోవడంతో అపార్ట్మెంట్ లోకి వెళ్లిన డ్రైవర్ అంకులు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు , పోలీసులకు సమాచారమిచ్చాడు .

Reas Also : రిలయన్స్ రియలైజేషన్ !

హత్య విషయం తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు వైసీపీ పై ఆరోపణలు చేయగా , ప్రతిపక్ష నేత తనయుడు లోకేష్ అంకులు అంత్యక్రియల్లో పాల్గొని ముఖ్యమంత్రి జగన్ హత్యకు బాధ్యత వహించాలంటూ జగన్ పై , వైసీపీ నేతల పై తీవ్ర ఆరోపణలు చేశారు .

ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సాక్షి అయిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించడంతో పాటు పలు కోణాల్లో విచారిస్తున్నారు . అపార్ట్మెంట్ వద్దకి కాల్ చేసి రమ్మన్న వ్యక్తి ఎవరు అన్న కోణంలో కాల్ డేటాని విశ్లేషిస్తున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో అనుకొంటున్నారు . ఈ సందర్భంగా వ్యాపార భాగస్వాములతో సుదీర్ఘ కాలంగా ఉన్న విభేదాలతో పాటు , కొందరు దగ్గరి బంధువులతో ఉన్న వివాదాల కోణం గురించి కూడా వెల్లడైందని పలువురు చర్చల్లో వెళ్లడవటం ఆసక్తికరం .

ఏదేమైనా ఈ రోజు సాయంత్రానికి హత్య వెనకున్న వ్యక్తులు , కోణాలు పోలీసు వర్గాల ద్వారా వెల్లడి కావొచ్చని విచారణను దగ్గర్నుండీ గమనిస్తున్న వారు అనుకొంటున్నారు .

Read Also : ధర్మపరిరక్షణే ధ్యేయం కావాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి