iDreamPost

Tamilrockerz తమిళ్ రాకర్జ్ రిపోర్ట్

ఎన్నో ప్రభుత్వాలు ఎందరో హీరోలు దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినప్పటికీ ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. కొత్త మూవీ రిలీజైతే చాలు గంటల వ్యవధిలో దాని తాలూకు కెమెరా ప్రింట్లను తమ సైట్ లో అందుబాటులో ఉంచడం ఏళ్ళ తరబడి చేస్తూనే ఉన్నారు.

ఎన్నో ప్రభుత్వాలు ఎందరో హీరోలు దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినప్పటికీ ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. కొత్త మూవీ రిలీజైతే చాలు గంటల వ్యవధిలో దాని తాలూకు కెమెరా ప్రింట్లను తమ సైట్ లో అందుబాటులో ఉంచడం ఏళ్ళ తరబడి చేస్తూనే ఉన్నారు.

Tamilrockerz తమిళ్ రాకర్జ్ రిపోర్ట్

ఆన్ లైన్ పైరసీలో సినిమాలు చూసేవారికి బాగా తెలిసున్న పేరు తమిళ్ రాకర్జ్. ఎన్నో ప్రభుత్వాలు ఎందరో హీరోలు దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినప్పటికీ ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. కొత్త మూవీ రిలీజైతే చాలు గంటల వ్యవధిలో దాని తాలూకు కెమెరా ప్రింట్లను తమ సైట్ లో అందుబాటులో ఉంచడం ఏళ్ళ తరబడి చేస్తూనే ఉన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని భాషల నిర్మాతలు దీని బారిన పడ్డ వాళ్లే. అయితే ఈ సైబర్ క్రైమ్ తాలూకు రహస్యాన్ని ఛేదించడం మాత్రం ఎవరి వల్ల కాలేదు. దీన్నే బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఓ వెబ్ సిరీస్ వచ్చింది. అదే తమిళ్ రాకర్జ్. సోనీ లివ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రిపోర్ట్ చూద్దాం


అతిరధి స్టార్ కొత్త సినిమా గరుడ మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది విడుదలకు సిద్ధంగా ఉంటుంది. ఒక రోజు ముందే దాన్ని పైరసీ చేసి వదులుతామని తమిళ్ రాకర్జ్ ప్రకటిస్తుంది. దీంతో అన్ని వర్గాల నుంచి దీన్ని ఎలాగైనా ఆపాలనే ఒత్తిడి మొదలవుతుంది. ఇండస్ట్రీ మీద అంతగా సదభిప్రాయం లేని ఎసిపి రుద్ర(అరుణ్ విజయ్)రంగంలోకి దిగుతాడు. ఇందులో ఫోరెన్సిక్ ఆఫీసర్ సంధ్య(వాణి భోజన్) ఉంటుంది. మరి ఈ బృందం కంటికి కనిపించని శత్రువును పట్టుకుంటుందా, గరుడ ప్రింట్ ని కాపాడుతుందా లాంటి ప్రశ్నలకు సమాధానం సిరీస్ లోనే చూడాలి. ఎవరూ కనీసం ఆలోచించని కాన్సెప్ట్ ని తీసుకున్న దర్శకుడు అరివజగన్ చాలా రిస్క్ చేశాడు.

Tamilrockerz

మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో నాలుగున్నర గంటలపైనే సాగే ఈ సుదీర్ఘమైన సిరీస్ ని ఓపికతో చూడాలి. తెలియని విషయాలను చూపించే ప్రయత్నం బలంగా చేశారు కానీ అరుణ్ విజయ్ క్యారెక్టరైజేషన్ తో సహా కీలక మలుపులకు సంబంధించి సరైన హోమ్ వర్క్ చేయకపోవడంతో తమిళ్ రాకర్జ్ మనం ఊహించుకున్నంత థ్రిల్ ఇవ్వదు. కానీ చీకటి ప్రపంచాన్ని పరిచయం చేసే తీరు మాత్రం మెప్పిస్తుంది. నిడివి కూడా సమస్య కావడంతో ఎక్కడికక్కడ అసంతృప్తి కలుగుతూనే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ గ్రాఫ్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే తమిళ్ రాకర్జ్ ఈ వ్యవహారం మీద ఆసక్తి ఉన్న వాళ్ళను ఓ మోస్తరుగా పర్వాలేదనిపించేలా మెప్పిస్తుంది కానీ కామన్ ఆడియన్స్ మాత్రం మరీ గొప్ప స్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి