ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న శేఖర్ కమ్ముల కొత్త సినిమా లవ్ స్టొరీ సమ్మర్ రిలీజ్ కోసం రెడీ అవుతోంది. మజిలి లాంటి హిట్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు చాలానే ఉన్నాయి. అందులోనూ ఎంసిఎ తర్వాత సాయి పల్లవి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో తన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా […]
నేడు శేఖర్ కమ్ముల పుట్టినరోజు. రాసికంటే వాసి ముఖ్యమన్న తీరుగా తక్కువ సినిమాలే చేసినా ఈయన తీసిన ఏ ఒక్క సినిమా కూడా ప్రజల అటెన్షన్ నుంచి తప్పించుకుపోలేదు. డాలర్ డ్రీంస్ తో మొదలైన ఈయన దర్శకత్వప్రస్థానం ఆనంద్, గోదావరి, హేపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా లతో సాగి ఇప్పుడు లవ్ స్టోరీతో నడుస్తోంది. ఈయన పుట్టినరోజుని పూరస్కరించుకుని నేడు షూటింగ్ స్పాటులో అతి పెద్ద కేక్ ను ఏర్పాటు చేసారు […]
సున్నితమైన భావోద్వేగాలతో సెన్సిబుల్ ఎమోషన్స్ తో సినిమాలు తీస్తాడని పేరున్న శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇద్దరు ముగ్గురు స్టార్లతో ప్లాన్ చేసుకున్నాడు కాని అవి వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత కొత్త నటీనటులతో ఆనంద్ హ్యాపీ డేస్ తరహలో ఓ యూత్ ఫుల్ మూవీ స్టార్ట్ చేస్తే షూటింగ్ పాతిక శాతం పూర్తి కాకుండానే అవుట్ పుట్ తేడా అనిపించడం మొత్తంగా దాన్ని క్యాన్సిల్ చేశారు. […]
https://youtu.be/