iDreamPost

Biryani: హైదరాబాద్‌: 365 రోజుల్లో 1633 బిర్యానీలు లాగించేశాడు.. అన్నెలా తిన్నావ్‌ అన్నా

  • Published Dec 15, 2023 | 2:35 PMUpdated Dec 15, 2023 | 2:50 PM

స్విగ్గి ఇయర్‌ ఎండ్‌ రిపోర్ట్‌ 2023లో ఆస్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏడాదంతా 1633 బిర్యానీలు తిన్నాడట. ఆ వివరాలు..

స్విగ్గి ఇయర్‌ ఎండ్‌ రిపోర్ట్‌ 2023లో ఆస్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏడాదంతా 1633 బిర్యానీలు తిన్నాడట. ఆ వివరాలు..

  • Published Dec 15, 2023 | 2:35 PMUpdated Dec 15, 2023 | 2:50 PM
Biryani: హైదరాబాద్‌: 365 రోజుల్లో 1633 బిర్యానీలు లాగించేశాడు.. అన్నెలా తిన్నావ్‌ అన్నా

ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఆకలేస్తుంది.. వంట చేయాలి అనే గోల లేకుండా.. ఆన్‌లైన్‌లో నచ్చిన ఫుడ్‌ని ఆర్డర్‌ చేసుకుని.. హాయిగా లాగించేయవచ్చు. ఉన్న చోటకే మనసుకు నచ్చిన ఆహారాన్ని రప్పించుకుని.. లొట్టలేసుకుంటూ తినవచ్చు. అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేదు.. ఎప్పుడు.. ఏం తినిలానిపిస్తే.. అప్పుడు ఆ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయవచ్చు. ఇక మన భాగ్యనగరవాసులకు బిర్యానీతో విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే మన దగ్గర ఎక్కువగా ఆర్డర్‌ చేసే ఆహార పదార్ధాల జాబితాలో బిర్యానీనే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది.

పైగాస్విగ్గీ విడుదల చేసిన ఇయర్ ఎండ్ రౌండప్ రిపోర్ట్‌లో కూడా మళ్లీ బిర్యానీనే టాప్‌లో నిలిచింది. బిర్యానీ అర్డర్లే టాప్‌లో నిలుస్తుండటం వరుసగా ఇది ఎనిమిదో సారి కావటం విశేషం. అయితే.. 2023 సంవత్సరంలో దేశంలో సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ సంస్థ తెలిపింది. అయితే.. ప్రతి 5.5 చికెన్ బిర్యానీలకు ఒక వెజ్ బిర్యానీ కూడా ఉందంట. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ఢిల్లీ నగరాల్లో చికెన్ బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా వచ్చినట్లు స్విగ్గీ తాజాగా విడుదల చేసిన ఇయర్‌ ఎండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాక బిర్యానీల కోసం రూ.10 వేలకు మించి ఖర్చు చేసి ఆర్డర్లు చేసిన కస్టమర్లు ఈ మూడు నగరాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు స్విగ్గి రిపోర్ట్‌ పేర్కొంది.

ఇక బిర్యానీలు ఆర్డర్‌లు చేయడంలో హైదరాబాద్‌ వాసులు తమ సత్తా చూపించారని స్విగ్గీ రిపోర్ట్‌ వెల్లడించింది. స్విగ్గీలో వచ్చిన ప్రతి 6 ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే అంటేనే అర్థం చేసుకోవచ్చు.. మన వాళ్లకు బిర్యానీ అంటే ఎంత పిచ్చో. ఇక ఓ వ్యక్తి అయితే.. ఏడాది మొత్తంలో ఏకంగా 1633 బిర్యానీలు ఆర్డర్ చేసి బిర్యానీ బ్రిగేడ్ విజేతగా నిలిచాడు. అంటే ఈ లెక్కన రోజుకు ఆ వ్యక్తి సరాసరిగా 4 బిర్యానీలను ఆర్డర్ చేశాడన్నమాట.

ఇతనే అంటే.. ఇక ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 42.3 లక్షల విలువైన ఆర్డర్స్ చేసినట్టుగా స్విగ్గీ తెలిపింది. ఈ రిపోర్ట్‌ చూసిన జనాలు.. రోజుకు అన్ని బిర్యానీలు ఎలా తిన్నావ్‌ బ్రదర్‌.. నీ కడుపు బాగానే ఉందా అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా బిర్యానీ అంటే మనకు ఎంత పిచ్చో తాజా రిపోర్ట్‌తో మరోసారి వెల్లడయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి