iDreamPost

వెంకటేష్ సినిమా గురించి ఫ్యాన్స్ టెన్షన్

వెంకటేష్ సినిమా గురించి ఫ్యాన్స్ టెన్షన్

ఒకపక్క థియేటర్లు చూస్తేనేమో జనంతో కళకళలాడుతున్నాయి. మరోవైపు డైరెక్ట్ ఓటిటి రిలీజుల ప్రహసనం ఆగడం లేదు. వెంకటేష్ నారప్ప ప్రైమ్ లో వచ్చినప్పుడు ఎంత ఇష్యూ అయ్యిందో చూశాం. నాని టక్ జగదీష్ కు ఏకంగా యుద్ధాలు జరిగినంత పనైంది. ఇప్పుడు దృశ్యం 2 వంతు వచ్చేలా ఉంది. గతంలోనే దీన్ని కూడా హాట్ స్టార్ కి ఇచ్చేశారని ఆ మేరకు ఒప్పందాలు అయ్యాయని రెండు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. కానీ నిన్న ట్విట్టర్ లో ఒక వెరిఫైడ్ హ్యాండిల్ నుంచి దృశ్యం 2 తిరిగి అమెజాన్ ప్రైమ్ తోనే డీల్ చేసుకుందని త్వరలోనే ప్రకటన వస్తుందని ట్వీట్ చేయడం మళ్ళీ కొత్త చర్చలకు దారి తీసింది.

నిజానిజాలు బయటికి రావాలంటే నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు స్పందించాల్సిందే. ఒకవేళ ఓటిటి అనుకున్నా సరే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ముందు వచ్చిన స్థాయిలో నిరసన ఎదురు కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు వరసగా వస్తూనే ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారం నుంచి ఇవింకా ఊపందుకోబోతున్నాయి. సో దృశ్యం 2 డిజిటల్ లో వచ్చినా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అభిమానుల నుంచి కొంత నిరసన వ్యక్తం కావొచ్చు అంతే. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ అయినట్టుగా ఒక చిన్న సమాచారం ఇచ్చారు తప్ప రిలీజ్ ఏ రూపంలో ఉండబోతోందో చెప్పలేదు.

ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలు రెండు విడుదల మార్గాలను ఫాలో కాక తప్పదు. ప్రతిదీ లవ్ స్టోరీ లాంటి వసూళ్లు తెస్తుందన్న గ్యారెంటీ లేదు. మాస్ట్రోని థియేటర్ లో రిలీజ్ చేసుంటే ఎలా ఉండేదో ఈజీగా ఊహించుకోవచ్చు. టక్ జగదీష్ కు ఖచ్చితంగా నష్టాలు వచ్చేవి. సో ప్రొడ్యూసర్లు ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎవరైనా సమర్ధించక తప్పదు. ఇటీవలే కొన్ని సినిమాలు కనీసం థియేటర్ల రెంట్లు కూడా తేలేనంత దారుణంగా బోల్తా కొట్టాయి. అలాంటివి ఓటిటిలో రావడమే సేఫ్. దృశ్యం 2 ఏదో ఒకటి మరికొద్ది రోజుల్లో క్లారిటీ ఇచ్చేస్తే బెటర్. ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అవుతారు

Also Read : సినిమా ప్రేమికులకు పండగ కానుకలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి