iDreamPost

Suriya And Vishal : ఆశలు పెట్టుకున్న సినిమాలూ హ్యాండ్ ఇచ్చాయి

Suriya And Vishal : ఆశలు పెట్టుకున్న సినిమాలూ హ్యాండ్ ఇచ్చాయి

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం జనవరి మీద మాములుగా పడలేదు. కొత్త సంవత్సరం బోణీనే బాక్సాఫీస్ కు చాలా నిరాసక్తంగా మొదలయ్యింది. బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కానీ దాని వల్లే అంతో ఇంతో థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. ఇక ఈ నెల చివరి వారం రిపబ్లిక్ డే సందర్భంగా ప్లాన్ చేసుకున్న విశాల్ సామాన్యుడు తన రిలీజ్ డేట్ ని జనవరి 26 నుంచి మరో తేదీకి మార్చుకుంది. కొత్త డేట్ ప్రకటించలేదు కానీ ట్రైలర్ పోస్టర్ లో కమింగ్ సూన్ అని హింట్ మాత్రమే ఇచ్చారు. ఏపి తమిళనాడులో యాభై శాతం ఆక్యుపెన్సీతో పాటు సెకండ్ షోల రద్దు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఇక ఫిబ్రవరి 4 రావాల్సిన సూర్య యాక్షన్ మూవీ ఈటి కూడా పోస్ట్ పోన్ అయ్యింది. అదే నెల చివరి వారంలో రిలీజ్ చేసేందుకు ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్ లో ఉంది. అదే రోజు రావాలిన ఆచార్య ఏకంగా ఏప్రిల్ 1కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈటి వంతు వచ్చింది. ఈ లెక్కన మొదటి వారం స్లాట్ పూర్తిగా ఖాళీ అయినట్టే. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న డీజే టిల్లు లాంటివి ఏమైనా వస్తాయేమో వేచి చూడాలి. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ పరిణామాల పట్ల తీవ్ర నిరాశగా ఉన్నారు. డబ్బింగ్ సినిమాలే అయినప్పటికీ విశాల్, సూర్యలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉందని, ఇప్పుడు అవి కూడా తప్పుకోవడంతో ఇబ్బందులు పెరుగుతాయని అంటున్నారు.

నిజానికి గత సంవత్సరం ప్రారంభం చాలా గొప్పగా నడిచింది. రవితేజ క్రాక్ తో మొదలుపెట్టి ఉప్పెన, జాతిరత్నాలు, వకీల్ సాబ్ వరకు నెలకో రెండు మూడు హిట్లు వచ్చి టికెట్ కౌంటర్ల దగ్గర సందడి నెలకొంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్ లు వెనక్కు వెళ్లడం తీవ్ర ప్రభావం చూపించింది. ఇంత వీక్ సంక్రాంతిని గత దశాబ్దంలో ఎన్నడూ చూడలేదని మూవీ లవర్స్ వాపోతున్నారు. బంగార్రాజు ఉన్నా అదొక్క ఆప్షన్ వాళ్ళను సంతృప్తి పరచడం లేదు. కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు తగ్గుతుందో, మునుపటిలా అంతా బాగుందనుకునే రోజులు ఎప్పుడు వస్తాయో సినిమా జనాలకు అంతు చిక్కని భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది

Also Read : Nani : దసరా కోసం న్యాచురల్ స్టార్ సాహసం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి