iDreamPost

అత్యాచార కేసు మహిళలపై నమోదు చేయొచ్చా..?

సాధారణంగా అత్యాచార కేసుల్లో మహిళలే బాధితులు. మగవాళ్లు నిందితులుగా ఉంటారు. అయితే అత్యాచార ఘటనల్లో మహిళలు నిందితులుగా ఉండటం గురించి విన్నారా. అలాంటి ఓ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు.

సాధారణంగా అత్యాచార కేసుల్లో మహిళలే బాధితులు. మగవాళ్లు నిందితులుగా ఉంటారు. అయితే అత్యాచార ఘటనల్లో మహిళలు నిందితులుగా ఉండటం గురించి విన్నారా. అలాంటి ఓ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు.

అత్యాచార కేసు మహిళలపై నమోదు చేయొచ్చా..?

కాలంతో పాటు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి దేశంలో. టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ దేశాల ముంగిట కాలర్ ఎగరేసే స్థాయికి భారత్ చేరుకుంటోంది. అయితేనేం ఆడ పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళలు, యువతులపై దారుణాలకు ఒడిగడుతున్నారు కామాంధులు. అయితే ఇలాంటి ఘటనల్లో సాధారణంగా మగవాళ్లే నిందితులుగా ఉంటారు. వారిపై కేసులు బనాయిస్తుంటారు. బాధితులు ఆడవాళ్లే. మరి ఇలాంటి అత్యాచార ఘటనల్లో మహిళలపై అభియోగాలు నమోదు చేయడం గురించి విన్నారా? అలా చేయొచ్చా? ఇదే అంశంపై పరిశీలన చేపట్టేందుకు అంగీకరించింది దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. అసలు ఏ జరిగిందంటే..?

పంజాబ్‌కు చెందిన 62 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఓ యువతితో మూడేళ్ల పాటు రిలేషన్‌లో ఉండగానే.. అతడు అమెరికా వెళ్లిపోయాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు కోరడంతో.. ఆన్ లైన్ మ్యారేజ్ చేసుకుని.. తాను తిరిగి విదేశాలకు వచ్చాక కోర్టు మ్యారేజ్ చేసుకుంటానని, అప్పటి వరకు తన అమ్మ దగ్గర ఉండాలని కోరాడు. కొన్నాళ్లకు చిన్న కుమారుడు పోర్చుగల్ నుండి వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు వెళ్లిపోయాడు. అయితే అతడు వెళ్లిన కొన్నాళ్లకు యువతి.. అత్త, మరిదిపై అత్యాచార కేసు పెట్టింది. భర్త సోదరుడు నగ్న ఫోటోలు చూపించి, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయం బయటకు చెప్పొంద్దంటూ అత్త బెదిరించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో తనను కావాలనే కోడలు ఇరికించిందని అత్త కింద కోర్టులను ఆశ్రయించగా కొట్టేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్త పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై స్పందన తెలపాలంటూ పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీసీలోని 375 సెక్షన్ ప్రకారం రేప్ కేసులో ఒక మహిళను నిందితురాలిగా పేర్కొనొచ్చా? లేదా అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు. అప్పటి వరకు పిటిషనర్‌కు అరెస్టు నుండి రక్షణ కల్పిస్తామని, దర్యాప్తుకు ఆమె సహకరించాలని ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి