iDreamPost

Sunil Narine: ఫలించని బుజ్జగింపులు.. సునీల్ నరైన్ కీలక నిర్ణయం!

అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ నరైన్ ను జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడించాలని విండీస్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ నరైన్ ను జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడించాలని విండీస్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

Sunil Narine: ఫలించని బుజ్జగింపులు.. సునీల్ నరైన్ కీలక నిర్ణయం!

సునీల్ నరైన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 286 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, అర్దశతకం ఉన్నాయి. ఇక బౌలింగ్ లో 9 వికెట్లు కూడా తీసుకుని అచ్చమైన ఆల్ రౌండర్ గా కితాబు అందుకుంటున్నాడు. అయితే నరైన్ గతేడాది నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అతడిని జూన్ లో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ లోకి తీసుకోవాలని విండీస్ క్రికెట్ బోర్డ్ భావిస్తోంది. అందుకోసం ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టింది. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

జూన్ లో స్టార్ట్ అవ్వబోతు టీ20 వరల్డ్ కప్ కోసం విండీస్ జట్టులోకి సునీల్ నరైన్ ను తీసుకోవాలని బోర్డు విశ్వప్రయాత్నాలు చేస్తోంది. కరేబియన్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్ సైతం నరైన్ ఫ్రెండ్స్, మాజీ ప్లేయర్లతో అతడిని వరల్డ్ కప్ లో ఆడే విధంగా ఒప్పించాలని బతిమిలాడినట్లు ఇటీవలే చెప్పుకొచ్చాడు. కానీ అతడు ఒప్పుకోవట్లేదని తన బాధను వ్యక్తం చేశాడు విండీస్ కెప్టెన్ పావెల్. అయితే తాను వరల్డ్ కప్ లో ఆడే విషయంపై తాజాగా స్పందించాడు నరైన్. ఈ మేరకు నరైన్ మాట్లాడుతూ..

“నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాను. చాలా మంది నేను నా రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకొని, టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని వారు బాహాటంగానే చెప్పారు. కానీ ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇలాగే ఉండాలనుకుంటున్నాను. వెస్టిండీస్ టీమ్ లో నాకు తలుపులు మూసుకుపోయాయి. కానీ వరల్డ్ కప్ లో పాల్గొనే ప్లేయర్లకు నా మద్ధతు ఎప్పుడూ ఉంటుంది. వారు గత కొంత కాలంగా చాలా కష్టపడుతున్నారు. వారి కష్టానికి ఫలితం దక్కాలని, మరో టైటిల్ ని సాధించాలని కోరుకుంటున్నాను” అని తాను పొట్టి వరల్డ్ కప్ లో ఆడలేనని స్పష్టం చేశాడు నరైన్. దీంతో విండీస్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలినట్లైంది. మరి నరైన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి