iDreamPost

వేలంలో అమ్ముడుపోని ఆటగాడు.. ముంబై పాలిట యముడయ్యాడు! రియల్‌ హీరో సందీప్‌ శర్మ!

  • Published Apr 23, 2024 | 8:34 AMUpdated Apr 23, 2024 | 8:34 AM

Sandeep Sharma, MI vs RR, IPL 2024: ముంబై ఇండియన్స్‌ లాంటి పటిష్టమైన టీమ్‌ను ఓ అన్‌సోల్డ్‌ ప్లేయర్‌ వణికించాడు. అయితే.. ఆ అన్‌సోల్డ్‌ బౌలర్‌ కథ చిన్నది కాదు. ఎంతో సాధించినా కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Sandeep Sharma, MI vs RR, IPL 2024: ముంబై ఇండియన్స్‌ లాంటి పటిష్టమైన టీమ్‌ను ఓ అన్‌సోల్డ్‌ ప్లేయర్‌ వణికించాడు. అయితే.. ఆ అన్‌సోల్డ్‌ బౌలర్‌ కథ చిన్నది కాదు. ఎంతో సాధించినా కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 23, 2024 | 8:34 AMUpdated Apr 23, 2024 | 8:34 AM
వేలంలో అమ్ముడుపోని ఆటగాడు.. ముంబై పాలిట యముడయ్యాడు! రియల్‌ హీరో సందీప్‌ శర్మ!

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది. సోమవారం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ముంబై ఇండియన్స్‌ను ఓ అన్‌సోల్డ్‌ ప్లేయర్‌ వణికించాడు. వణికించడమే కాకుండా.. ముంబై ఇండియన్స్‌ ఓటమిని ఒంటిచేత్తో శాసించాడు. ఆ అన్‌సోల్డ్‌ బౌలర్‌ పేరు సందీప్‌ శర్మ. 2013 నుంచి దాదాపు ప్రతి ఐపీఎల్‌ ఆడుతున్న సందీప్‌ శర్మకు ఐపీఎల్‌ 2024 కోసం జరిగిన వేలంలో ఘోర అవమానం ఎదురైంది. ఆ వేలంలో సందీప్‌ శర్మను ఏ ఫ్రాంచైజ్‌ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఐపీఎల్‌ చరిత్రలోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ బౌలర్‌గా, డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా ఉన్న సందీప్‌ శర్మను టీమ్‌లోకి ఏ ఫ్రాంచైజ్‌ తీసుకోలేదు. మోస్ట్‌ అండర్‌ రేటెడ్‌ బౌలర్‌గా మిగిలిపోయాడు.

అయితే.. ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లోని ఓ ప్లేయర్‌ గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతని స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా సందీప్‌ శర్మ రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. కానీ, సీజన్‌ ఆరంభంలోనే గాయపడ్డాడు. అయినా కూడా నిరాశ చెందకుండా.. గాయం నుంచి పూర్తిగా కోలుకుని.. ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగి.. తన సత్తా చూపించాడు. వేలంలో తనను కొనుగోలు చేయలేదనే కసి మొత్తాన్ని చూపిస్తూ.. ఏకంగా ముంబై ఇండియన్స్‌ పాలిట యముడిలా మారిపోయాడు. 5 వికెట్ల హాల్‌ సాధించి.. తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌ 119 మ్యాచ్‌లు ఆడిన సందీప్‌ శర్మ కేవలం 7.84 ఎకానమీతో బౌలింగ్‌ చేస్తూ.. 130 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి.. ముంబై ఇండియన్స్‌ను ఓడించాడు.

ఇంత మంచి బౌలర్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజ్ కూడా ఎందుకు కొనుగోలు చేయలేదో అర్థం కానీ ప్రశ్న. టీ20 క్రికెట్‌లో 7.84 ఎకానమీ అంటే మామూలు విషయం కాదు. 8 ఎకానమీ ఉన్నా కూడా మంచి బౌలర్‌గా టీ20 క్రికెట్‌లో పరిగణిస్తారు. కానీ, దాదాపు 11 ఏళ్లుగా ఇదే ఎకానమీ మెయిటేన్‌ చేస్తున్నా.. సందీప్‌ శర్మను ఎందుకు ఫ్రాంచైజీలు పట్టించుకోవడం లేదు అని క్రికెట్‌ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఐపీఎల్‌ చరిత్రలోనే సందీప్‌ శర్మ మోస్ట్‌ అండర్‌ రేటెడ్‌ బౌలర్‌గా అభివర్ణిస్తున్నారు. ఆరంభ ఓవర్లలో తన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తించే సందీప్‌ శర్మ.. డెత్‌ ఓవర్లలో అయితే.. స్లోవర్‌ డెలవరీస్‌తో బ్యాటర్ల చేతులు కట్టేస్తాడు. అందుకే సందీప్‌ శర్మకు డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా పేరుంది. కానీ, ఐపీఎల్‌ 2023లో జరిగిన వేలంలో సందీప్‌ అన్‌సోల్డ్‌గా మిగలడం ఎవరికి మింగుడు పడని విషయం. అయినా.. కూడా ఒక వారియర్‌లా తిరిగొచ్చి.. తనను తాను ఓ రియల్‌ హీరోగా ప్రజెంట్‌ చేసుకుంటున్న సందీప్‌ శర్మకు నిజంగా సెల్యూట్‌ చేయాల్సిందే. మరి సందీప్‌ శర్మ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి