iDreamPost

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మిస్టరీ స్పిన్​ మొనగాడు!

  • Author Soma Sekhar Published - 02:45 PM, Mon - 6 November 23

ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతడు ఆడింది తక్కువ మ్యాచులే అయినప్పటికీ.. బ్యాటర్లకు తన బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. అర్థం కానీ మిస్టరీ స్పిన్ తో వరల్డ్ క్రికెట్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంతటి స్టార్ బౌలర్ తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం ప్రకటించాడు.

వరల్డ్ క్రికెట్ లో షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే లాంటి ఎందరో మేటి స్పిన్ మాంత్రికులు ఉన్నారు. వీరు ముగ్గురు ప్రపంచ క్రికెట్ పై తమదైన ముద్రవేశారు. అయితే వీరందరి తర్వాత మళ్లీ స్పిన్ బౌలింగ్ లో అంతటి సంచలనం సృష్టిన బౌలర్ ఒకరున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతడు ఆడింది తక్కువ మ్యాచులే అయినప్పటికీ.. బ్యాటర్లకు తన బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. అర్థం కానీ మిస్టరీ స్పిన్ తో వరల్డ్ క్రికెట్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంతటి స్టార్ బౌలర్ తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి.. ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. 35 ఏళ్ల ఈ విండీస్ మిస్టరీ స్పిన్ మాంత్రికుడు తన చివరి మ్యాచ్ ను 2019లో ఆడాడు. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్న నరైన్.. తన కెరీర్ లో 65 వన్డే, 51 టీ20, 6 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఇక అన్ని ఫార్మాట్స్ లో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు. 2012 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో నరైన్ సభ్యుడిగా ఉన్నాడు.

“దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా కెరీర్ కు మద్ధతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నాను” అంటూ తన రిటైర్మెంట్ ప్రకటనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు నరైన్. ఇక ఐపీఎల్ లో నరైన్ 162 మ్యాచ్ లు ఆడి.. 163 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగాటోర్నీలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు ఈ విండీస్ స్టార్ ఆల్ రౌండర్. కాగా.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు నరైన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి