iDreamPost

‘సుకన్య సమృద్ధి యోజన’ లబ్ధిదారులకు అలెర్ట్.. దీన్ని చేయకపోతే అకౌంట్ క్లోజ్!

‘సుకన్య సమృద్ధి యోజన’ లబ్ధిదారులకు అలెర్ట్.. దీన్ని చేయకపోతే అకౌంట్ క్లోజ్!

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక పథకాలను అందిస్తుంది. ప్రజా సంక్షేమం కోసం కొన్ని పథకాలు, ప్రజలక ఆర్థిక భరోసా కోసం మరికొన్ని స్కీమ్ లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా చిన్న చిన్న పొదుపు రూపంలో డబ్బులు అందే పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అందించే పొదుపు స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా రిట్నర్స్ వస్తాయి. అందుకే చాలా మంది చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడతారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ‘సుకన్య సమృద్ధి యోజన’ ఒకటి. స్కీమ్ లో పెట్టుబులు పెడితే వచ్చే..లాభాలు కూడా బాగానే ఉంటాయి. అయితే  ఇందులో పెట్టుబడులు పెట్టే వారు.. అకౌంట్ విషయంలో కొన్ని కీలక పత్రాలు అందించాల్సి ఉంటుంది. అవి అందించని పక్షంలో  ఖాత మూసివేయబడుతుంది. మరి.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్రం అదిస్తున్న పథకాల్లో సుకన్న సమృద్ధి యోజన అగ్రస్థానంలో ఉంది. ఈ స్కీమ్ ద్వారా  అత్యధిక వడ్డీ రేటును పొందవచ్చు. మీరు ఈ పథకంలో చేరినట్లయితే, 8 శాతం వడ్డీ  రేటు లభిస్తుంది.  పోస్టాఫీసు లేదా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా  ఈ స్కీమ్ లో  చేరవచ్చు.  10ఏళ్ల లోపు బాలికలు, అలానే ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లు ఈ పథకంలో చేరవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని భావించే వారు..తమ బిడ్డల పేరిట సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో అకౌంట్ తెరవొచ్చు.

ఇందులో రూ.250 పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 ఏళ్ల కాలం వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఈస్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 21 ఏళ్లు ఉంటుంది. ఈ పథకంలో చేరిన ఒక అమ్మాయి 18 ఏళ్లు నిండిన తరువాత.. ఆమె మొత్తంలో నుంచి 50 శాతం పొందవచ్చు.  అలానే ఆ అమ్మాయికి  21 ఏళ్లు నిండితన తరువాత పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని బట్టి మీ రాబడులు తీసుకొవచ్చు. ఈ పథకంలో  డబ్బులు పెట్టుబడి పెట్టే వారు ఆధార్ కార్డును  అందించాలి. ఖాతా తెరిచిన ఆరు నెలల్లోపు ఈ పని పూర్తి చేయాలి.

అలా చేయని పక్షంలో ఖాతా రద్దు చేయబడుతుంది. ఈ క్రమంలో ఆధార్ ను మళఅలీ యాక్టీవేట్ చేయాలి. అసలు అకౌంట్ తెరిచే సమయంలోనే ఆధార్ ను అందజేస్తే. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా ఉండదు. పాన్ కార్డు కూడా  అందించాల్సి ఉంటుంది. అకౌంట్ తెరిచిన తేదీ నుండి 2 నెలల్లోపు పాన్ కార్డ్ జారీ చేయాలి. మరి.. ఇవ్వన్నీ పాటిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావు. మరి.. సుకన్య  సమృద్ధి యోజన స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కేవలం రూ.49తో రూ.లక్ష.. ఫోన్‌పే అదిరే శుభవార్త!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి