iDreamPost

మహిళలకు ఫ్రీ జర్నీపై విద్యార్థుల ఆందోళన.. కారణం ఏంటంటే?

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా మహిళలకు ఉచిత ప్రయాణంపై పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు కారంణం ఏంటంటే?

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా మహిళలకు ఉచిత ప్రయాణంపై పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు కారంణం ఏంటంటే?

మహిళలకు ఫ్రీ జర్నీపై విద్యార్థుల ఆందోళన.. కారణం ఏంటంటే?

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు గ్యారెంటీ పథకాలను అమల్లో తీసుకు రావడం జరిగింది. అందులో భాగంగా మహిళకు మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అనుకున్న పథకం ప్రకారం ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఈనెల 9న సోనియగాంధీ జన్మదిన సందర్భంగా ప్రారంభించారు. ఇది మొదలు పెట్టిన వారం రోజుల వరకు సజావుగా జరిగింది. అయితే గతకొద్ది రోజుల నుంచి బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిపోయింది. కాగా, ఈ పథకం మొదలుపెట్టి కనీసం రెండు వారాలు గడవక ముందే మహిళలు నానా ఇబ్బందులు పడుతూ ఇళ్లకు చేరుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఈ ఉచిత బస్సు ప్రకటన తర్వాత.. ఆర్టీసీ బస్సుల్లో మునుపెన్నడు లేని విధంగా మహిళల ప్రయాణికులు పెరిగారు. ఇక ఫ్రీ బస్సు పుణ్యమ అంటూ.. బస్సులు ఎక్కువగా లేకపోవడంతో కొంతమంది మహిళలతో పాటు, కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతిరోజూ పుడ్ బోర్డు చేస్తూ ఇంటికి వెళ్తున్నారు. అయితే తాజాగా కొందరు విద్యార్థులు ఉచిత బస్సుల ప్రయాణంతో ఇబ్బంది పెడుతున్నారని నిరసన తెలిపారు ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సుల సదుపాయంతో.. ఆర్టీసీ బస్సులు రద్దీతో పాటు. ఆగే పరిస్థితి కూడా లేకుండా పోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆటో యూనియన్లు సైతం మహిళ ఉచిత బస్సు సదుపాయాన్ని రద్దు చేయాలని కొరుతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో స్కూల్ విద్యార్థులు కూడా చేరారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అటు బస్ స్టాండ్ నుంచి కోటపల్లి మెడల్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు.. సరిపడా బస్సు లు లేక తాము నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మాకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్లవలసిన బస్సులు రద్దీగా వస్తున్న కారణంగా తాము ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయలేకపోతున్నాము. కాగా, ఉదయం వేళల్లో రెండు బస్సులు మాత్రమే అటుగా వెళ్తున్నాయి. అయితే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మాకు పాసులు ఉన్నా.. మా కోసం బస్సులు ఆపడం లేదు. దీంతో మేము ప్రయాణాలు చేయలేక క్లాసులకు దూరమవుతున్నావు. ఇలా క్లాసులకి అలస్యంగా వెళ్తే మా భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారుతుందని రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు.

మమ్మల్ని స్కూల్ కు దూరం చేసే ఈ పథకాన్ని నిలిపివేయాలంటూ.. చెన్నూరు బస్ స్టాండ్ లో మెడల్ స్కూల్ విద్యార్థులు ”వీవాంట్ బస్సెస్” అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఉచిత బస్సుల కారణంగా ప్రజలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై .. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. ఆ తర్వాత బస్‌ల సంఖ్యను కూడా పెంచి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని చాలమంది డిమాండ్ చేస్తున్నారు. మరి, ఫ్రీ బస్సు ప్రయాణం పై ప్రజల పడుతున్న ఇబ్బందుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి