iDreamPost

విద్యార్థులు అలర్ట్.. విద్యాశాఖ కీలక నిర్ణయం!

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాల అమలుకై కృషి చేస్తున్నారు.

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాల అమలుకై కృషి చేస్తున్నారు.

విద్యార్థులు అలర్ట్.. విద్యాశాఖ కీలక నిర్ణయం!

నేటి పోటీ ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాదాన్యత సంతరించుకుంది. విద్యలేని వాడు వింత పశువు అన్నట్లు.. కనీస విద్యార్హత లేకుంటే ఎక్కడా సరైన ఉద్యోగఅవకాశాలు లేకుండా పోతున్నాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లలను ఎన్ని కష్టాలు పడైనా సరే సరైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు సైతం విద్యా విషయంలో కీలక మార్పులు తీసుకువస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ పై పట్టు వచ్చేలా ప్రత్యేక శద్ద తీసుకుంటుంది. తాజాగా ప్రభుత్వం విద్యార్థుల హాజరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు అమలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేందుకు ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల హాజరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్  హాజరు విధానాన్ని అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని గత ఏడాదే ప్రవేశ పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇక నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారుల నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు అన్ని స్కూళ్లకు జారీ చేసింది.

ts educational ststem

రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. ఈ హాజరు విధానం ద్వారా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్య పుస్తకాలను పంపినీ చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరు తీసుకునే విధానం ఉండేంది.. ప్రతి నెల చివరి తేదీల్లో ప్రధానోపాధ్యాయుడు రాష్ట్ర కార్యాలయానికి పంపించేవాళ్లు. అయితే వారు పంపించే వివరాలకు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం, దుస్తులు, పుస్తకాల్లో పలు తేడాలు వస్తున్నాయని ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు విద్యార్థులకు ఫెషియల్ రికగ్నిషన్ ఉంటే ఎలాంటి తప్పులు జరగవనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి