iDreamPost

అయోధ్య రాముని విగ్రహాన్ని చెక్కింది ఇతనే.. MBA చదివి శిల్పిగా మారిన అరుణ్ కథ!

Arun Yogiraj: కోట్లాది మందితో పూజలను అందుకోనున్న అయోధ్య రామ్ లల్లా విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది. జనవరి 22న అయోధ్య రామమందిర గర్భగుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు.

Arun Yogiraj: కోట్లాది మందితో పూజలను అందుకోనున్న అయోధ్య రామ్ లల్లా విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది. జనవరి 22న అయోధ్య రామమందిర గర్భగుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు.

అయోధ్య రాముని విగ్రహాన్ని చెక్కింది ఇతనే.. MBA చదివి శిల్పిగా మారిన అరుణ్ కథ!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆరాధించే దైవం శ్రీరాముడు. ఆయన జన్మస్థలం అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది ఎన్నో ఏళ్ల కల. అలా శ్రీరాముడి భక్తులు ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన కల నిజమయ్యే తరుణం వచ్చేసింది. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామమందిర గర్భగుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. గర్భగుడిలో ప్రతిష్టించేందుకు 3 విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర తయారు చేయించింది. ఇక ఇక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన ఒకటి విషయం తెలియాల్సి ఉంది. ఇక శ్రీరాముడి విగ్రహంలో ఏంబీఏ చదివిన వ్యక్తిది కీలక పాత్ర ఉంది. ఏంబీఏ చదివిన సదరు వ్యక్తి శిల్పిగా మారి.. రాముడి విగ్రహాన్ని రూపొందించారు. మరి.. ఆ వ్యక్తి ఎవరు.. ఆయన శిల్పిగా ఎలా మారాడు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకి చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. అయోధ్యలో ప్రతిష్టించే రాముడి విగ్రహం ఖరారైన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక రామ జన్మభూమి ట్రస్ట్ ఎంపిక చేసిన విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ మరెవరో కాదు.. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ కుమారుడు కావడం గమనార్హం. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి కావడం విశేషం.

ఇక అరుణ్ యోగి రాజ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ నుంచి శిల్పిగా మారే క్రమంలో అనే ఘటనలు జరిగాయి. అరుణ్ యోగిరాజ్ కి చిన్నతనం నుంచి కార్వింగ్  అంటే చాలా  ఇష్టం ఉండేది. అందుకే ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పని చేశారు. అయితే అలా కంపెనీలో చేసిన ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది. తమ పూర్వీకుల నుంచి వస్తున్న శిల్పకళను కొనసాగించాలని భావించాడు. దీంతో అదే విషయాన్ని అరుణ్.. తన తండ్రికి తెలిపాడు.  అయితే దీనికి తండ్రి ముందుగా అంగీకరించలేదు. ఎంబీఏ చదివి ఇలా వారసత్వ వృత్తిలోకి రావడం ఆయనకు నచ్చలేదు. అయితే కొడుకు కోరిక ముందు యోగిరాజ్ తలొగ్గాల్సి వచ్చింది.

ఓ షరతుతో కుమారుడి శిల్పకళను చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ వి కనుక శిల్ప కళను ఓ వ్యాపార వస్తువుగా భావించవద్దని, భక్తి శ్రద్ధలతో పని చేయాలని అరుణ్ కి సూచించారు. అంతేకాని రాతి విగ్రహాల కొనుగోలు, అమ్మకాలు వంటి మార్కెటింగ్ చేయరాదని ఆయన తెలిపారు. ఈ రంగంలో కళా సేవ మాత్రమే చేయాలని అరుణ్ తండ్రి షరతు పెట్టారు. తండ్రి షరతులకు అరుణ్ యోగిరాజ్ అంగీకరించి.. 2008లో తన శిల్పకళా వృత్తిలోకి ప్రవేశించాడు. ఇక రాతి విగ్రహ శిల్పకళలో అరుణ్ యోగిరాజ్ కు రెండు వందల ఏళ్ల తరతరాల వారసత్వం ఉంది. అరుణ్ కుటుంబానికి చెందిన ఐదు తరాల వారు రాళ్ళను శిల్పాలుగా మలచే పనిలో కళలో నిమగ్నమై ఉన్నారు.

ఇక అప్పటి నుంచి అరుణ్ యోగి రాజ్ తన కళలో నిమగ్నమయ్యాడు. మొదట్లో చిన్న చిన్న మండపాలను చెక్కి తన వృత్తిని ప్రారంభించాడు. అనంతరం పంచముఖ గణపతి, మహావిష్ణువు, బుద్ధుడు, నంది, స్వామి శివ బాల యోగి, శివకుమార్, బనశంకరీ దేవి విగ్రహాలను చెక్కి ఆలయాలకు అందజేశారు. అలా అరుణ్ తన రక్తంలో శిల్పకళ ఉందని నిరూపించుకున్నాడు.  ఇక తన అద్భుతమైన శిల్ప కళ ప్రతిభతో అనేక విగ్రహాలను తీర్చిదిద్దాడు. మైసూరులోని ఐదు అడుగుల గరుడ దేవుని విగ్రహం, దేశంలోనే అతి పెద్ద ఏకశిలా పాలరాతి శ్రీ రామకృష్ణ పరమహంస విగ్రహాన్ని  రూపొందించాడు.

అరుణ్ తన అద్భుతమైన నైపుణ్యంతో హనుమాన్ హోయసల శిల్పాన్ని రూపొందించాడు. అనేక అద్భుతమైన కళఖండాలతో అరుణ్ యోగిరాజ్ జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించాడు. ఇప్పుడు రామ్ లల్లా విగ్రహంతో అరుణ్ మరో అద్భుత కళాఖండం సృష్టించాడు. దీంతో ఆయన జన్మ ధన్యమైందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి..ఎంబీఏ నుంచి శిల్పిగా మారిన అరుణ్ యోగిరాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి