iDreamPost

డయాబెటిస్ పేషెంట్స్ కు శుభవార్త.. ఇకపై ఆ బాధ తీరినట్లే!

షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలోనే వారి సమస్యలకు ఊరట లభించనుంది. ఇకమీదట షుగర్ పేషెంట్స్ సంవత్సరానికి కేవలం మూడు సార్లు మాత్రమే ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందట. ఆ దిశగా పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు.

షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలోనే వారి సమస్యలకు ఊరట లభించనుంది. ఇకమీదట షుగర్ పేషెంట్స్ సంవత్సరానికి కేవలం మూడు సార్లు మాత్రమే ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందట. ఆ దిశగా పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు.

డయాబెటిస్ పేషెంట్స్ కు శుభవార్త.. ఇకపై ఆ బాధ తీరినట్లే!

డయాబెటిస్ దీనినే మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటుంటాం. ఇక ఈ వ్యాధి గురించి తెలియంది ఏముంది, జీవితంలో ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డ ఎవరైనా.. వాళ్ళ దినచర్యను, ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిందే. ప్రతిరోజు మందులు వేసుకుంటూ.. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉండాల్సిందే. ఈ వ్యాధి ఎంత నరకమో దానిని అనుభవించే వారికి మాత్రమే అర్ధమౌతుంది. అయితే, షుగర్ వ్యాధిగ్రస్తుల సమస్యలకు చెక్ పెట్టేలా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఓ కొత్త విధానాన్ని కనుగొన్నారు. అదేంటంటే ఇకమీదట షుగర్ పేషెంట్స్ సంవత్సరానికి కేవలం మూడు సార్లు మాత్రమే ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందట. అదేలా సాధ్యం అనుకుంటున్నారా!. అయితే దాని గురించి తెలుసుకోవాల్సిందే మరి.

ఇప్పుడున్న జనరేషన్ లో షుగర్ వ్యాధిని ఒక నార్మల్ వ్యాధిలా భావిస్తున్నారు. ఎందుకంటే వయస్సు భేదం లేకుండా ఈ మహమ్మారి వచ్చేస్తుంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం కేవలం భారత్ లోనే 10 కోట్ల మందికి పైగా షుగర్ వ్యాధిగ్రస్థులు ఉన్నారట. బ్లడ్ లోని గ్లూకోస్ లెవెల్స్ ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది. మారుతున్న కాలంలోని ఆహారపు అలవాట్లు, వాతావరణం కూడా ఇందుకు ఓ కారణం. దీర్ఘకాలికంగా ఈ సమస్య అనేది రోగులను వేధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స ఇప్పటివరకు రాలేదు. ఒక్కసారి షుగర్ ఎటాక్ అయిందంటే చాలు లైఫ్ లాంగ్ దానిని మోస్తూ తిరగాల్సిందే. మనం తినే ఆహారంలో కూడా తీపి పదార్దాలను లేకుండా చూసుకోవాలి. అప్పటివరకు సాఫీగా సాగిన వారి దినచర్యకు పూర్తి భిన్నంగా అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే షుగర్ వ్యాధి నిర్మూలన మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు హైడ్రోజెల్ ఆధారిత ఇంజక్షన్ ను కనుగొన్నారు. ఈ ఇంజక్షన్ ను కేవలం ఏడాదికి మూడు సార్లు మాత్రమే తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. దీనివలన తరచు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక తొలుత ఈ ఇంజక్షన్ ను ఎలుకల మీద ప్రయోగించారు. 42 రోజులకు ఒకసారి ఎలుకలకు హైడ్రోజెల్ ను ఇంజెక్ట్ చేసి పరిశోధించారు. ఈ పరిశోధనలో ఎలుకల రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ తో పాటు..వాటి బరువు కూడా కంట్రోల్ లో ఉన్నట్లు తెలిపారు.

ఎలుకలలో 42 రోజుల దినచర్య మనుషులలో 4 నెలలకు సమానమని పరిశోధకులు తెలిపారు. వీరి తదుపరి పరిశీలన పందులపైన ప్రయోగిస్తారట. ఎందుకంటే పందుల చర్మం మనుషుల చర్మం, ఎండోక్రైన్ వ్యవస్థను కలిగి ఉంటాయట. ఆ తర్వాత 18 నెలల నుంచి రెండేళ్ల లోపు పిల్లలపై ఈ పరిశోధనను ప్రయోగిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏదేమైనా, ఈ కొత్త ప్రయోగం కనుక ఫలిస్తే..షుగర్ పేషెంట్స్ కు కాస్త ఊరట కలుగుతుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి