iDreamPost

BCCIతో లంక కాళ్ల బేరం.. ఆ సాయం చేసి పుణ్యం కట్టుకోమంటూ..!

  • Published Jan 11, 2024 | 5:29 PMUpdated Jan 11, 2024 | 5:29 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పెట్టుకోవడానికి అన్ని క్రికెటింగ్ నేషన్స్ భయపడతాయి. మన బోర్డును గెలికిన ఓ దేశం ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పెట్టుకోవడానికి అన్ని క్రికెటింగ్ నేషన్స్ భయపడతాయి. మన బోర్డును గెలికిన ఓ దేశం ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది.

  • Published Jan 11, 2024 | 5:29 PMUpdated Jan 11, 2024 | 5:29 PM
BCCIతో లంక కాళ్ల బేరం.. ఆ సాయం చేసి పుణ్యం కట్టుకోమంటూ..!

శ్రీలంక క్రికెట్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఒకే ఒక్క టోర్నమెంట్​లో ఓటమి ఆ జట్టును ఈ స్థితికి తీసుకొచ్చింది. అదే వన్డే వరల్డ్ కప్-2023. గతేడాది భారత్ వేదికగా జరిగిన మెగాటోర్నీ లంక టీమ్ అట్టర్ ఫ్లాప్ అయింది. గ్రూప్ దశలో ఆడిన 9 మ్యాచుల్లో ఏకంగా ఏడింట్లో ఓడింది. కేవలం రెండు మ్యాచుల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండో ప్లేస్​లో నిలిచింది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించడంలో ఫెయిలైంది. దీంతో లంక బోర్డును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సీరియస్ అయిన ఐసీసీ.. లంక టీమ్​ను బ్యాన్ చేసింది. ఆ తరుణంలో ఆ దేశ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ సీరియస్ అయ్యాడు. భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జై షా వల్లే తమ దేశానికి ఈ గతి పట్టిందన్నాడు. అయితే బీసీసీఐతో లంక తాజాగా కాళ్ల బేరానికి వచ్చింది. ఒక సాయం చేసి పుణ్యం కట్టుకోవాలని కోరింది.

ఐపీఎల్​-2024లోని కొన్ని మ్యాచులను తమ దేశంలో నిర్వహించాలని శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ హరిన్ ఫెర్నాండో బీసీసీఐ సెక్రటరీ జై షాను కోరారని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే సమ్మర్​లో లోక్​సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐపీఎల్​ను వేరే దేశంలో నిర్వహిస్తారని రూమర్స్ వస్తున్నాయి. దుబాయ్​లో టోర్నీ జరుగుతుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్​లోని కొన్ని మ్యాచుల్ని తమ దేశంలో నిర్వహించాలని లంక మినిస్టర్ జై షాను కోరారనే న్యూస్ వైరల్​గా మారింది. నష్టాల్లో ఉన్న తమకు ఆదాయం సమకూర్చుకునేందుకు సాయం చేయాలని జై షాను లంక మంత్రి కోరారని తెలిసింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత బోర్డు రద్దవడం, ఐసీసీ బ్యాన్ విధించడం, అండర్-19 ప్రపంచ కప్​ను తరలించడంతో లంక క్రికెట్ ఆదాయానికి భారీగా గండి పడింది. జై షానే అన్నీ చేశారని.. లంక క్రికెట్​ను ఆయనే నాశనం చేశారని అర్జున రణతుంగ తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

జై షా మీద రణతుంగ చేసిన వ్యాఖ్యల్ని అప్పట్లో లంక గవర్నమెంట్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ నిర్వహణ అంశం తెర పైకి రావడంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, వన్డే ప్రపంచ కప్​కు ముందు వరకు లంక క్రికెట్​లో అంతా సవ్యంగా సాగినట్లు కనిపించింది. వరుస విజయాలతో ఆ జట్టు మంచి జోష్​లో కనిపించింది. కానీ అనుభజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం, కీలక ప్లేయర్లు గాయాలతో దూరమవడం, ఆడిన వాళ్లు ఫెయిల్ అవడంతో వరల్డ్ కప్​లో నాకౌట్​కు చేరుకోకుండానే ఆ టీమ్ వెనుదిరిగింది. ఆ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా లాంటి బడా టీమ్స్​తో పాటు ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లోనూ లంక దారుణంగా ఓటమిపాలైంది. దీంతో ఆ దేశ బోర్డును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత దీనికి జై షానే కారణమంటూ రణతుంగ వివాదానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ మ్యాచుల్ని లంకలో జరపాలని తాజాగా ఆ దేశ మంత్రి ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. మరి.. బీసీసీఐతో లంక కాళ్ల బేరానికి రావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: విరాట్‌ కోహ్లీ-రోహిత్‌ శర్మ సత్తాకు ఇది అగ్ని పరీక్ష! ఫెయిలైతే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి