iDreamPost

రిషబ్ పంత్ రీఎంట్రీపై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! కెప్టెన్సీ అతనిదే..

  • Author singhj Published - 03:40 PM, Sat - 11 November 23

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్​లో అతడి రాకపై లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్​లో అతడి రాకపై లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • Author singhj Published - 03:40 PM, Sat - 11 November 23
రిషబ్ పంత్ రీఎంట్రీపై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! కెప్టెన్సీ అతనిదే..

రిషబ్ పంత్.. భారత క్రికెట్​పై అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసిన ప్లేయర్. కీపర్​గా, బ్యాట్స్​మన్​గా తన ఆటతీరుతో ఎంతో మంది మనసులను దోచుకున్నాడు పంత్. షార్ట్ టైమ్​లోనే అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాలో రెగ్యులర్​ ప్లేయర్​గా మారాడు. టీ20లు, వన్డేల కంటే కూడా టెస్టుల్లో అతడి బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో బౌలర్ ఎవరు? పిచ్ ఎలా ఉంది? లాంటివి పట్టించుకోడు పంత్. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీకి తరలించేందుకు ఇష్టపడతాడు. టెస్టుల్లో అటాకింగ్ బ్యాటింగ్​తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు రిషబ్. ఇంగ్లండ్ గడ్డ మీద కూడా కొన్ని మర్చిపోలేని ఇన్నింగ్స్​లు ఆడాడు.

విదేశీ పిచ్​లపై ఆడేందుకు ఆసియా ప్లేయర్లు భయపడతారు. కానీ పంత్ మాత్రం ఫారెన్ కంట్రీస్​లో బాగా బ్యాటింగ్ చేస్తాడు. బౌన్సీ, పేస్ ట్రాక్​ల మీద ఎక్కువ రన్స్ చేస్తాడు. అలాంటి కీలక ప్లేయర్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. ఏడాది కింద పంత్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్తున్న క్రమంలో అతడి కారు డివైడర్​ను ఢీకొట్టి మంటల్లో కాలిబూడిదైంది. ఆ టైమ్​లో కారులో పంత్ ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతడు నిద్రమత్తులో జారుకోవడంతోనే ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడిన స్టార్ బ్యాటర్ టీమ్​కు దూరమయ్యాడు. మెళ్లిగా కోలుకున్న పంత్.. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు.

నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్​లో ఉన్న పంత్ అక్కడ తన ఫిట్​నెస్​ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే మునుపటి ఫామ్​ను అందుకోవడంతో పాటు బ్యాటింగ్, కీపింగ్ టెక్నిక్స్​ను బెటర్​ చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పంత్ రీఎంట్రీ ఎప్పుడనే దానిపై క్లారిటీ లేదు. దీని మీద భారత లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ స్పష్టత ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు డైరెక్టర్​గా వ్యవహరిస్తున్న దాదా గుడ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఐపీఎల్​లో పంత్ తప్పక ఆడతాడని అన్నాడు. ‘పంత్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్​లో అతను ఆడతాడు. ఐపీఎల్ వేలం గురించి రిషబ్​తో డిస్కస్ చేశాం. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్​కు కెప్టెన్​గా పంత్ ఉండాలని అందరమూ భావిస్తున్నాం’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. మరి.. ఐపీఎల్​లో పంత్ రీఎంట్రీ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నవీన్‌ ఉల్‌ హక్‌.. 24 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి