iDreamPost

Kalki: వందల కోట్లు ఖర్చు! అయినా.. కల్కికి రక్షణ లేదా?

  • Published Feb 16, 2024 | 3:32 PMUpdated Feb 16, 2024 | 3:32 PM

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రం మీదే అందరి ఆశలు . ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ఈ సినిమా గురించి అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కల్కి సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రం మీదే అందరి ఆశలు . ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ఈ సినిమా గురించి అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కల్కి సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

  • Published Feb 16, 2024 | 3:32 PMUpdated Feb 16, 2024 | 3:32 PM
Kalki: వందల కోట్లు ఖర్చు! అయినా.. కల్కికి రక్షణ లేదా?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రస్తుతం వస్తున్న సినిమా “కల్కి 2898AD”. ఇప్పుడు అందరి ఆశలు, ఎదురు చూపులు ఈ చిత్రంపైనే ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ చిత్రం ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ అయింది. అసలే అందరు ఓ రేంజ్ లో ఈ సినిమా గురించి ఎక్సపెక్టషన్స్ పెంచుకుంటున్నారంటే.. ఇక ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి ఒక్కొక్కటిగా వస్తున్న అప్ డేట్స్ మరిన్ని ఆశలని పెంచేస్తుంది. అసలు ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే.. ఈ రేంజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయంటే.. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి హడావిడి చేస్తుందో.. ఈపాటికే అందరికి ఊహాగానాలు మొదలైపోయి ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా కల్కి సినిమా నుంచి కొన్ని ఫొటోస్, వీడియోస్ లీక్ అయ్యాయి అంటూ.. కొన్ని వార్తలు .. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, “కల్కి 2898 AD” చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు . ఈ సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్. అలానే ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అయిందని.. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయంటూ .. సామజిక మాధ్యమాలలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఆ ఫోటోలు తెగ షేర్ అయిపోతూ.. వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను గమనిస్తే సినిమా షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక వీటి వలన ప్రభాస్ అభిమానులలో “కల్కి 2898AD” సినిమాపైన మరింత హైప్ క్రియేట్ చేసినట్లయింది. మరో వైపు.. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాకు ఇలా ఫొటోస్ వీడియోస్ లీక్ అవ్వడం అంటే.. ఓ విధంగా సినిమాకు ఎక్కడో ఒక దగ్గర మైనస్ అవుతుందని భావిస్తున్నారు కొందరు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్.. లాంటి భారీ తారాగణం కీలకపాత్రలలో నటిస్తున్నారనే వార్తలను కూడా వింటూ వస్తున్నాం . మరి ఈ సినిమా థియేటర్ లో విడుదల అయిన తరవాత ఇంకెంత క్రేజ్ ను తెచుకుంటుందో వేచి చూడాలి. అలాగే ఈలోపు ఈ మూవీపై ఇంకెన్ని అప్ డేట్స్ వస్తాయో అవి ఇంకెంత ఎక్సయిట్మెంట్ ను పెంచుతాయో అని.. అందరూ ఇంకాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, వరుసగా కల్కి మూవీ గురించి వస్తున్న అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి