iDreamPost

Ball of the Century యాసిర్ షా ‘బాల్ ఆఫ్ ది సెంచరీ వేశాడా?

Ball of the Century యాసిర్ షా ‘బాల్ ఆఫ్ ది సెంచరీ వేశాడా?

టెస్టు క్రికెట్‌లో బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ అంటే స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌, జూన్‌ 4, 1993న వార్న్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ మైక్‌ గాటింగ్‌ను ఔట్ చేసిన బాల్. పూర్తిగా లెగ్‌స్టంప్‌ దిశగా వెళ్లిన బంతి, టర్న్‌ తీసుకుంది, ఆఫ్‌స్టంప్‌ వికెట్‌ను ఎగురగొట్టింది. బాల్ యూట‌ర్న్ తీసుకున్న ఫీలింగ్. క్రీజులో ఉన్న మైక్‌ గాటింగ్ నోరెళ్ల‌బెట్టాడు. క్రికెట్ ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌పోయింది. అలా షేన్‌ వార్న్‌ ”బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ” చరిత్రకెక్కింది.

తాజాగా పాకిస్తాన్ లెగ్ స్పిన్న‌ర్ యాసిర్‌ షా కూడా వార్న్‌ తరహాలోనే బాల్ ని స్పిన్ చేశాడు. చూసిన‌వాళ్లంతా బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా చెబుతున్నారు. పాకిస్తాన్‌, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో
యాసిర్‌ షా డెలివరీకి కుషాల్‌ మెండిస్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. అప్పుడు కుషాల్‌ 74 పరుగుల వద్ద ఉన్నాడు. ఇన్నింగ్స్‌ 56వ ఓవర్లో యాసిర్‌ షా బౌలింగ్ చేశాడు. క్రీజులో పూర్తిగా లెగ్‌స్టంప్‌ అవతల వేసిన బంతి, అనూహ్యమైన టర్న్‌ తీసుకొని ఆఫ్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది.


ఇంకోసంగ‌తి, యాసిర్ షా, దిగ్గ‌జం షేర్ వార్న్ శిష్యుడుకూడా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి