iDreamPost

కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క! ప్రీ వెడ్డింగ్‌ వీడియో రిలీజ్‌

  • Published Mar 25, 2024 | 10:58 AMUpdated Mar 25, 2024 | 6:35 PM

సోషల్ మీడియాలో అందరిలానే ఇన్‌ఫ్లుయన్సర్‌గా పరిచయం అయ్యి.. తెలంగాణ ఎన్నికల సమయంలో మరింత ఫేమస్ అయిన బర్రెల్లక్క పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకి కాబోయే వరుడిని అందరికి పరిచయం చేసింది.

సోషల్ మీడియాలో అందరిలానే ఇన్‌ఫ్లుయన్సర్‌గా పరిచయం అయ్యి.. తెలంగాణ ఎన్నికల సమయంలో మరింత ఫేమస్ అయిన బర్రెల్లక్క పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకి కాబోయే వరుడిని అందరికి పరిచయం చేసింది.

  • Published Mar 25, 2024 | 10:58 AMUpdated Mar 25, 2024 | 6:35 PM
కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క! ప్రీ వెడ్డింగ్‌ వీడియో రిలీజ్‌

కన్నె శిరీష అలియాస్ బర్రెలక్క .. తెలంగాణ పెద్దకొత్తపల్లి మండలం , మరికల్ గ్రామానికి చెందిన యువతి. తెలంగాణ ఎన్నికల ముందు వరకు కూడా ఆమె కేవలం .. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌గా మాత్రమే అందరికి పరిచయం. ఆమె ఇంస్టాగ్రామ్ లో తన వీడియోస్ తో .. ఎంతో మంది యువతను ఆలోచింపజేసేలా చేసింది. అప్పటికే సోషల్ మీడియాలో ఓ మోస్తరు పేరు ఉన్న బర్రెలక్క .. తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత ఆమె బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఇటీవల పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించిన బర్రెలక్క .. తాజాగా ఆమెకు కాబోయే వరుడిని , పెళ్లి తేదిని కూడా ప్రకటించింది.

తెలంగాణ ఎన్నికల సమయంలో .. బర్రెలక్క కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో.. నాలుగవ స్థానంలో నిలిచింది. ఆమె ఓడిపోయినా కూడా ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపింది. తానూ ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ .. కేవలం యువతను మేల్కొపేందుకు మాత్రమే అంటూ.. అని కూడా ఆ సమయంలో బర్రెలక్క చెప్పుకొచ్చింది. ఇక బర్రెలక్క విషయానికొస్తే.. ఆమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వలన .. శిరీష తల్లీకి సాయంగా ఉంటూ ఓపెన్‌ డిగ్రీ చేసినట్లు గతంలో ఓసారి చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు బర్రెలక్క పెళ్లి పీటలు ఎక్కబోతుంది. రీసెంట్ గా దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇక ఆమె అభిమానులంతా తనకి కాబోయే వరుడు ఎవరా అని .. సెర్చింగ్ స్టార్ట్ చేసేశారు.

Barrelakka Wouldbe

దీనితో తాజాగా శిరీష.. ఆమెకు కాబోయే వరుడి పేరు, అతని ఫొటోతో పాటు ఆమె పెళ్లి తేదీని కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మార్చి 28న వెంకటేశ్‌ అనే అబ్బాయితో శిరీష వివాహం జరగబోతుంది. అతను ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ పూర్తి చేసినట్లుగా సమాచారం. వీరిద్దరూ కలిసి ఓక ఫోటో షూట్‌ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Raj Yadav (@barrelakka.brother)

 

View this post on Instagram

 

A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి