iDreamPost

వీడియో: రోడ్డు షోలో తప్పిపోయిన చిన్నారిని తల్లి దగ్గరకు చేర్చిన కేటీఆర్

  • Published Nov 27, 2023 | 4:30 PMUpdated Nov 27, 2023 | 4:30 PM

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కొన్ని చోట్ల ఆసక్తికర సన్నివేశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తప్పి పోయిన చిన్నారిని తల్లి వద్దకు చేర్చి.. మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్. ఆ వివరాలు..

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కొన్ని చోట్ల ఆసక్తికర సన్నివేశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తప్పి పోయిన చిన్నారిని తల్లి వద్దకు చేర్చి.. మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్. ఆ వివరాలు..

  • Published Nov 27, 2023 | 4:30 PMUpdated Nov 27, 2023 | 4:30 PM
వీడియో: రోడ్డు షోలో తప్పిపోయిన చిన్నారిని తల్లి దగ్గరకు చేర్చిన కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో నేతలందరూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల క్యాంపెయిన్లో అక్కడక్కడ కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ రోడ్ షోలో మనసుకు హత్తుకునే సన్నివేశం ఒకటి వెలుగు చూసింది. రోడ్ షోలో తప్పిపోయిన చిన్నారి కోసం మీటింగ్ ఆపేయడమే కాక.. అక్కడకు వచ్చిన వారంతా ఒక్కటయ్యి.. చిట్టితల్లిని తల్లి వద్దకు చేర్చారు. తల్లీబిడ్డలు ఒక్కటైన వేళ.. అక్కడున్న వారంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు. మనసుకు హత్తుకునే ఈ సన్నివేశం రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు కేటీఆర్.. వీర్నపల్లి పట్టణంలో రోడ్డు షో నిర్వహించారు. వేల సంఖ్యలో వచ్చిన జనాలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తున్నారు. ఎంతో గంభీరంగా మీటింగ్ కొనసాగుతుండగా.. ఇంతలో అక్కడకు ఓ మహిళ వచ్చింది. కళ్ల నిండా నీళ్లతో.. ఒణికిపోతున్న ఆమెను చూసి పోలీసులు ఏమైందంటూ ఆరా తీయగా.. తన ఐదేళ్ల కూతురు గాయత్రి ఎక్కడో తప్పిపోయిందని.. ఏడుస్తూ చెప్పింది ఆ మహిళ. జనసంద్రంలా మారిన ఆ ప్రాంతంలో.. ఆ చిన్నారిని గుర్తించడం ఎలానో అర్థం కాక.. పోలీసులు ఆ మహిళను.. కేటీఆర్ ప్రచార రథం ముందుకు తీసుకువెళ్లి.. పాప గురించి మైక్‌లో అనౌన్స్ చేపించేందుకు ప్రయత్నించారు.

అయితే.. అప్పటికే ఎంతో సీరియస్‌గా.. తన ముందున్న జనసంద్రాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ పోతున్నారు కేటీఆర్. ఈ క్రమంలో అక్కడున్న వాళ్లంతా మంత్రిని పిలిచే ప్రయత్నం చేశారు. వాళ్లను గమనించిన కేటీఆర్.. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి.. ఏమైందని ఆరా తీశారు. విషయం తెలుసుకున్న కేటీఆర్.. సదరు మహిళకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పాప పేరు, వయసును కనుక్కుని.. మైక్‌లో అనౌన్స్ చేశారు. ఎవరికైనా చిన్నారి కనిపిస్తే.. తన వాహనం దగ్గరికి తీసుకురావాలని.. తల్లి ఇక్కడ ఏడుస్తుందని అనౌన్స్ చేశారు.

కేటీఆర్ అనౌన్స్ చేయటంతో.. చిన్నారిని గుర్తించిన ఓ యువకుడు పాపను పైకెత్తి కేటీఆర్‌కు చూపించాడు. ఆ తర్వాత గాయత్రిని కేటీఆర్ వాహనం వద్దకు తీసుకువచ్చి.. తల్లికి అప్పగించారు. బిడ్డను అక్కున చేర్చుకున్న ఆ క్షణం.. ఆ తల్లిలో కళ్లల్లో కనిపించిన సంతోషం చూసి కేటీఆర్ తో సహా అక్కడున్న వారంతా సంబరపడ్డారు. చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత వాతావారణాన్ని తేలిక పరిచేందుకు జోక్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి