iDreamPost

Kerala: 40 ఏళ్ళ తర్వాత బాయ్స్ స్కూల్లో అడుగుపెట్టిన అమ్మాయిలు

Kerala: 40 ఏళ్ళ తర్వాత బాయ్స్ స్కూల్లో అడుగుపెట్టిన అమ్మాయిలు

అది తిరువనంతపురంలోని గవర్నమెంట్ మోడల్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్. 203 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ స్కూల్లోకి నలభయ్యేళ్ళ తర్వాత అమ్మాయిలు అడుగు పెట్టారు. 12 మంది బాలికలు సైన్స్ అండ్ హ్యుమానిటీస్ స్ట్రీమ్ కింద 11th క్లాస్ లో జాయినయ్యారు. కేరళ రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు వాళ్ళకి మొక్కలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. పదో క్లాసు వరకు గర్ల్స్ స్కూల్లోనే చదివిన ఓ అమ్మాయి ఇప్పటికైనా కో-ఎడ్ స్కూల్లో జాయినైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుత సమాజంలో జెండర్ గురించి సరైన అవగాహన లేదని, నిజానికి అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడమే కరెక్టని చెప్పుకొచ్చింది. పిల్లల తల్లిదండ్రులు కూడా కో-ఎడ్ స్కూలే కరెక్టని అభిప్రాయపడుతున్నారు.
1819లో కో-ఎడ్ గా మొదలైన ఈ స్కూలు, పిల్లల సంఖ్య పెరిగిపోయాక గర్ల్స్, బాయ్స్, తమిళ మీడియం స్కూళ్ళుగా విడిపోయింది. అయితే కేరళ ప్రభుత్వం ఇటీవలే గర్ల్స్, బాయ్స్ స్కూల్స్ కో-ఎడ్ గా మారవచ్చన్న ఆప్షన్ ఇచ్చింది. దీంతో ఈ స్కూలు ఈ విద్యా సంవత్సరం నుంచే హయ్యర్ సెకండరీ లెవల్ లో అమ్మాయిలు, అబ్బాయిలను జాయిన్ చేసుకుంటోంది.
కేరళలో మొత్తం 280 బాలికల పాఠశాలలు, 164 బాలల పాఠశాలలు ఉన్నాయి. గత సంవత్సర కాలంలో వీటిలో 11 స్కూల్స్ కో-ఎడ్ గా మారాయి. మిగతా స్కూల్స్ కూడా ఇదే విధంగా ఏకాభిప్రాయం సాధిస్తే ప్రభుత్వం తప్పక అనుమతి మంజూరు చేస్తుందని కేరళ విద్యాశాఖ మంత్రి చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి