iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య

దేశంలో సామాన్యులు, సెలబ్రెటీలు చిన్న చిన్న విషయాకే డిప్రేషన్ లోకి వెళ్లి బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు.

దేశంలో సామాన్యులు, సెలబ్రెటీలు చిన్న చిన్న విషయాకే డిప్రేషన్ లోకి వెళ్లి బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో చిత్రాల్లో అలరించిన నటీనటులు, అద్బుతమైన చిత్రాలు అందించిన దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. అనారోగ్యం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ ఇబ్బందులతో ఆర్థిక కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పపడుతున్నారు. సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి.. క్షణికావేశంలో ఓ సింగర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ నటి, గాయని విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పూత్ (35) అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. కొత్వాలీ నగర్ లోని సీతాకోండ్ ప్రాంతలో మల్లికా రాజ్‌పుత్ మంగళవారం తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. 35 ఏళ్ల వయసులో తన గానంతో ఎంతోమందిని అలరించి మంచి పేరు తెచ్చుకుంది మల్లికా రాజ్‌పుత్. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మల్లిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మల్లిక తల్లి సుమిత్రా సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదు.. గతి తలుపులు మూసి ఉన్నాయి.. లైట్ వెలుగుతుండటంతో అనుమానం వచ్చి తలుపులు తట్టాం… ఎంతకీ తీయకపోవడంతో కిటికీలోనుంచి చూడగా ఫ్యాన్ కి నా కూతురు వేలాడుతూ కనిపించింది.. వెంటనే నా భర్తకు, పక్కంటి వాళ్లకు ఫోన్ చేశాను. కానీ అప్పటికే నా కూతురు చనిపోయింది అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ మాట్లాడుతూ.. మల్లికా రాజ్‌పూత్ చనిపోయిన విధానం చూస్తుంటే అది ఆత్మహత్యల అనిపిస్తుందని తెలిపారు. పోస్ట్ మార్టం నవేదికలు వచ్చిన తర్వాత ఖచ్చితమైన కారణాలు చెప్పగలం అని అన్నారు. మల్లిక రాజ్‌పూత్ చనిపోవడంతో సెలబ్రెటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి