iDreamPost

Shruti Haasan: బ్రేకప్‌ తర్వాత తొలిసారి స్పందించిన శృతిహాసన్‌! సంచలన పోస్ట్‌..

సెలబిట్రీలు తమకు సంబంధించిన గుడ్, బ్యాడ్  న్యూస్ లను పలు రకాలుగా వ్యక్త పరుస్తుంటారు. తాజాగా కమల్ హాసన్ కుమార్తె హీరోయిన్ శృతిహాసన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

సెలబిట్రీలు తమకు సంబంధించిన గుడ్, బ్యాడ్  న్యూస్ లను పలు రకాలుగా వ్యక్త పరుస్తుంటారు. తాజాగా కమల్ హాసన్ కుమార్తె హీరోయిన్ శృతిహాసన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

Shruti Haasan: బ్రేకప్‌ తర్వాత తొలిసారి స్పందించిన శృతిహాసన్‌! సంచలన పోస్ట్‌..

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన లవ్ ఎఫైర్స్, డైవర్స్ వంటి అనేక విషయాల గురించి తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో సెలబిట్రీలు తమకు సంబంధించిన గుడ్, బ్యాడ్  న్యూస్ లను పలు రకాలు గా వ్యక్త పరుస్తుంటారు. తాజాగా కమల్ హాసన్ కుమార్తె హీరోయిన్ శృతిహాసన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

శృతిహాసన్ … ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా  తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనస్సును దోచుకుంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ అమ్మడు తన తండ్రి నటించిన హేరామ్‌ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది. 2009లో లక్‌ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ కి హాయ్  చెప్పింది. 2011లో 7సెన్స్  సినిమాతో చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమానే ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. శృతి హాసన్ బ్యాగ్రౌండ్  తమిళే అయినప్పటికీ.. కోలీవుడ్ కంటే ఎక్కువ సక్సెస్ లో తెలుగులో అందుకుంది.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమే ఈ అమ్మడిని ఎక్కువగా ఆదరిస్తూ వస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు, రవితేజ, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి హిట్ లోను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాక లక్కీ హీరోయిన్‌గా  ఈ అమ్మడు ముద్ర వేసుకున్నారు. ఇటీవల సలార్‌తో సక్సెస్‌ అందుకోగా ప్రస్తుతం రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు కూతురిగా నటించనున్నారనే టాక్ గట్టిగా సాగుతోంది. ఇది ఇలా ఉంటే.. ఆమె వ్యక్తి గత జీవితం విషయానికి వస్తే.. ఆమెకు ప్రేమ అనేది అచ్చి రాలేదనే చెప్పాలి. ఇటీవలే తన ప్రియుడితో బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఆ వార్తకు బలం చేకూరుస్తూ తాజాగా ఆమె చేసిన పోస్టు..ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నా డోర్స్‌ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్‌ శృతిహాసన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు.

ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో ఫెయిలైన శృతిహాసన్‌ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడితో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఇటువంటి పోస్టు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్‌ అవ్వాలనుకోవడం లేదని తాజాగా ఈ అమ్మడు చేసిన పోస్టులో పేర్కొంది. హృదయ తలుపులు మూసేశానని, ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదని లవ్ ఫెయిల్యూర్ అయిన వారు పాడుకునేలాంటి పాటను పోస్ట్‌ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి