iDreamPost

ఈ వారం కెప్టెన్ గా శోభాశెట్టి! ఎలిమినేట్ అయితే?

వీకెండ్ అనగానే అందరూ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు కెప్టెన్ అయ్యారు? ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారు అంటే శోభాశెట్టి అంటున్నారు.

వీకెండ్ అనగానే అందరూ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు కెప్టెన్ అయ్యారు? ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారు అంటే శోభాశెట్టి అంటున్నారు.

ఈ వారం కెప్టెన్ గా శోభాశెట్టి! ఎలిమినేట్ అయితే?

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ అనగానే అందరూ ఎవరు కెప్టెన్ అవతున్నారు? ఎవరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు? అనే ప్రశ్నలకు చాలా కామన్ గా అడుగుతూ ఉంటారు. అయితే ముందు కెప్టెన్ ఎవరు అయ్యారు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం హౌస్ లో శోభాశెట్టి కెప్టెన్ అయ్యినట్లు లీకులు వస్తున్నాయి. అలాగే కెప్టెన్ అవ్వడం కూడా ఫుల్ ఉల్టా పుల్టాగా ఉందని చెబుతున్నారు. కెప్టెన్ కావడంలో కూడా ట్విస్టులు ఉన్నాయి. మరి.. కెప్టెన్ అయినంత మాత్రానా శోభాశెట్టి సేవ్ అవుతుందా?

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఎవరూ కూడా అంత ఈజీగా గేమ్ ని అంచనా వేయలేరు. అయితే ఈ వారం శోభాశెట్టి అనుకున్నది సాధించింది అనే చెప్పాలి. ఎందుకంటే 9 వారాలుగా హౌస్ కి కెప్టెన్ కావాలి అంటూ శోభాశెట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హౌస్ లో ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అని పోరాడుతోంది. అయితే ఎట్టకేలకు ఆమె కోరిక ఫలించిందని తెలుస్తోంది. ఈ వారం హౌస్ కి కెప్టెన్ శోభాశెట్టి విజయం సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రతి సీజన్ లో ఒక టాస్కు ఉంటుంది. అదేంటంటే.. ఒకరి కోసం మరొకరు కెప్టెన్సీ పోటీదారులుగా బరిలోకి దిగాల్సి ఉంటుంది.

గెలిచిన టీమ్ కి కాదని ఓడిపోయిన శివాజీ వాళ్ల టీమ్ కు గేమ్ లో పోటీపడే అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. అంటే గెలిచిన టీమ్ లో ఉన్న కెప్టెన్సీ కంటెండర్స్ తరఫున ఓడిన టీమ్ నుంచి ఒకరు పోటీ పడాల్సి ఉంటుంది. యావర్ కోసం శివాజీ పోరాడాడు అంటున్నారు. ఇంక శోభాశెట్టి కోసం అమర్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. బీన్ బ్యాగ్స్ టాస్కులో అమర్ చివరి వరకు నిలబడి విజయం సాధించి.. శోభాని కెప్టెన్ చేశాడు అని చెబుతున్నారు. అంటే ఈ వీక్ అమర్ దీప్ కి చాలా మంచి పాజిటివ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అలాగే హెల్త్ బాగోకపోయినా కూడా యావర్ కోసం శివాజీ పోటీకి రావడం కూడా గొప్ప విషయమే. అయితే ఇక్కడే ఇంకో బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. టాస్కులో విజయం సాధించి కెప్టెన్ అయినంత మాత్రానా శోభాశెట్టి సేఫ్ జోన్ లో ఉన్నట్లు కాదు.

అనధికారిక పోలింగ్ ప్రకారం శోభా శెట్టి ఇంకా డేంజర్ జోన్ లోనే ఉంది. రతికా, శోభా, తేజా.. ఈ ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే రతికా వల్ల ఇప్పుడే హౌస్ లో రచ్చ షురూ అవుతోంది. కాబట్టి రతికాని పంపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అలాగే హౌస్ లో తేజా వల్ల ఫన్ క్రియేట్ అవుతోంది. కాబట్టి అంత ఈజీగా తేజాని ఎలిమినేట్ చేసే ఆస్కారం లేకపోవచ్చు. అటు బయట నెగిటివిటీ, ఉల్టా పుల్టా సీజన్ ఇలా అన్నీ గమనిస్తే.. కెప్టెన్ అయిన వారమే శోభాశెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే శోభా తన కోరిక నెరవేర్చుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అనుకోవాలి. అదే సమయంలో కెప్టెన్ అయ్యి హౌస్ లో లేకుండా పోయానే అనే బాధ ఆమె చాలా రోజులు అనుభవించాల్సి ఉంటుంది. మరి.. శోభాశెట్టి కెప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి