iDreamPost

Shivam Dube: వీడియో: మోస్ట్ సీనియర్ ప్లేయర్ ను భయపెట్టిన శివమ్ దూబే! శివతాండవమే…

శివమ్ దూబే.. తన హార్డ్ హిట్టింగ్ తో మోస్ట్ సీనియర్ ప్లేయర్ ను భయపెట్టాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది.. తన బ్యాటింగ్ సత్తాను మరోసారి రుజువుచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

శివమ్ దూబే.. తన హార్డ్ హిట్టింగ్ తో మోస్ట్ సీనియర్ ప్లేయర్ ను భయపెట్టాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది.. తన బ్యాటింగ్ సత్తాను మరోసారి రుజువుచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Shivam Dube: వీడియో: మోస్ట్ సీనియర్ ప్లేయర్ ను భయపెట్టిన శివమ్ దూబే! శివతాండవమే…

శివమ్ దూబే.. ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు. పేస్ ఆల్ రౌండర్ గా జట్టులోకి దూసుకొచ్చిన భారీ హిట్టర్.. పేరుకు తగ్గట్లుగానే రాణిస్తున్నాడు. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ ల్లో దుమ్మురేపడమే కాకుండా.. అజేయంగా నిలిచి విన్నర్ గా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను తన భారీ షాట్లతో బెంబేలెత్తించడంలో దిట్ట దూబే. ఇక రెండో టీ20లో మోస్ట్ సీనియర్ బౌలర్ అయిన మహ్మద్ నబీకి చుక్కలు చూపించాడు. అతడి వేసిన ఓ ఓవర్లో శివతాండవం చేశాడు శివమ్ దూబే. దీంతో బిక్కమెుఖం వేశాడు మహ్మద్ నబీ.

113 అంతర్జాతీయ టీ20లు, 156 వన్డేలు ఆడిన అనుభవం మహ్మద్ నబీ సొంతం. అద్భుతమైన బౌలింగ్ తో ఆఫ్గానిస్తాన్ జట్టుకు వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు ఈ స్టార్ బౌలర్. మోస్ట్ సీనియర్ బౌలర్ అయిన నబీని టీమిండియా యువ బ్యాటర్ భయపెట్టాడు. తన హార్డ్ హిట్టింగ్ ఆటతో అతడికి చెమటలు పట్టించాడు. కేవలం 1 వన్డే, 20 టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉన్న దూబే.. స్టార్ బౌలర్ గా కితాబు అందుకుంటున్న నబీకి చుక్కులు చూపించాడు. ఆఫ్గాన్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 10వ ఓవర్ వేయడానికి వచ్చాడు నబీ. అప్పటికి దూబే 11 బంతుల్లో 15 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఓవర్ పూర్తి అయ్యేసరికి 14 బంతుల్లో 33 రన్స్ కు చేరుకున్నాడు.

ఇక ఈ ఓవర్ లో దూబే.. తన విశ్వరూపం చూపాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది మోస్ట్ సీనియర్ బౌలర్ ను వణికించాడు. ఐపీఎల్ లో ఆడిన అనుభవాన్ని అంతా ఇక్కడ ఉపయోగించాడు దూబే. అతడు అలా భారీ షాట్లు కొడుతుంటే.. ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏం చేయలేకపోయాడు నబీ. దూబే బాదుడుకు రెండు ఓవర్లు మాత్రమే వేసిన నబీ 30 పరుగులు సమర్పించుకున్నాడు. శివమ్ దెబ్బకి మరోసారి బంతి ముట్టుకోలేదు ఈ స్టార్ బౌలర్. తొలి మ్యాచ్ లో కూడా 60 రన్స్ తో అజేయంగా నిలిచి, జట్టుకు విజయాన్ని అందించాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 6 వికెట్లతో ఆఫ్గాన్ ను చిత్తుచేసి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆఫ్గాన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. జైస్వాల్ 68, దూబే 63* రన్స్ తో చెలరేగారు. మరి మోస్ట్ సీనియర్ బౌలర్ మహ్మద్ నబీ బౌలింగ్ ను దంచికొట్టిన దూబేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి