iDreamPost

Bhajarangi : భజరంగిని తక్కువ అంచనా వేయడానికి లేదు

Bhajarangi : భజరంగిని తక్కువ అంచనా వేయడానికి లేదు

ప్రతి శుక్రవారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. మొన్న 22న వచ్చినవేవి కనీస స్థాయిలో సంతృప్తినివ్వలేక పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి 29 వైపు వెళ్తోంది. దీపావళి పండగ ముందు వస్తున్న ఈ పోరు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఉన్నవాటిలో ఎక్కువ అంచనాలు ఉన్నది వరుడు కావలెనుకే. ట్రైలర్ వచ్చాక ఫ్యామిలీ ఆడియన్స్ కి దీని మీద మంచి గురి ఉంది. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ లో నాగ శౌర్య-రీతూ వర్మ కాంబో ఆసక్తి రేపుతోంది. ఇక ఆకాష్ పూరి రొమాంటిక్ ట్రైలర్ యూత్ దృష్టిని బాగానే ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసింది

వీటి సంగతి పక్కనపెడితే కన్నడలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన భజరంగి 2 కూడా అదే రోజు రాబోతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని అదే రోజు తెస్తున్నారు. శాండల్ వుడ్ లో సీనియర్ స్టార్ హీరోగా అశేషమైన ఫాలోయింగ్ ఉన్న శివ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ మీద అక్కడ హైప్ ఓ రేంజ్ లో ఉంది. ఇది సీక్వెల్. 2013లో వచ్చిన భజరంగి అప్పట్లో బ్లాక్ బస్టర్. ఇక్కడా రిలీజ్ చేశారు కానీ మనవాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. మార్కెటింగ్ సరిగా చేయకపోవడం సమస్య గా మారింది. ఇప్పుడు భజరంగి 2 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది రేస్ లో ఉందని ప్రేక్షకులు గుర్తిస్తున్నారు.

ఒకప్పుడు కన్నడ డబ్బింగులు మీద మనవాళ్ళు అంతగా ఆసక్తి చూపించేవాళ్ళు కాదు కానీ కెజిఎఫ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అక్కడి ప్రొడ్యూసర్లు కోట్ల పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. పొగరు, రాబర్ట్ లాంటివి తెలుగులో నిరాశపరిచినా అందులో విజువల్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ భజరంగి ట్రైలర్ వాటికి భిన్నంగా ఏదో మ్యాటర్ గట్టిగానే ఉందనిపించేలా సాగింది. శివ రాజ్ కుమార్ ఇక్కడి ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు కానీ కంటెంట్ ఉంటే అదేమంత పెద్ద విషయం కాదు. హర్ష దర్శకత్వం వహించిన భజరంగి 2లో భావన మోహన్ హీరోయిన్ కాగా అరుణ్ జన్య సంగీతం అందించారు

Also Read : )Nline Ticketing : పరిశ్రమ ప్లస్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పరిణామం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి