iDreamPost

Sehari : సెహరి రిపోర్ట్

Sehari :  సెహరి రిపోర్ట్

మొన్న శుక్రవారం పోటీ గట్టిగా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ కు ధైర్యం చేసిన చిన్న సినిమా సెహరి. రవితేజ ఖిలాడీ, విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ లతో పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ నే టార్గెట్ చేసిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ప్రమోషనల్ మెటీరియల్ ఆసక్తికరంగానే అనిపించింది. డెబ్యూ దర్శకుడు జ్ఞాన సాగర్ దీని ద్వారా పరిచయమయ్యారు. హీరో కొత్తవాడు కావడంతో పెద్దగా అంచనాలేం లేవు కానీ మౌత్ టాక్ ని నమ్ముకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ వీక్ గానే మొదలయ్యాయి. మరి పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సెహరి శెభాష్ అనిపించుకుందా లేక అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్న స్మాల్ మూవీస్ క్యాటగిరీలో పడిందా రిపోర్ట్ లో చూద్దాం.

వరుణ్(హర్ష్)ది దూకుడుగా సాగే కుర్రాడి మనస్తత్వం. ఈ ప్రవర్తన నచ్చకే కాలేజీలో ప్రేమించిన సుబ్బలక్ష్మి అతనికి బ్రేకప్ చెప్పేస్తుంది. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకుని తనేంటో ఋజువు చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. పెద్దలు అలియా(స్నేహ విలిదిండి)తో సంబంధం కుదురుస్తారు. అయితే అనూహ్యంగా సీన్ లోకి ఎంటరైన అలియా సోదరి అమూల్య(సిమ్రాన్ చౌదరి)ని చూసి ఇష్టపడిన వరుణ్ ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. అలియాతో పెళ్లి వద్దని డిసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడితగాడి కన్ఫ్యూజన్ ఏ తీరానికి చేరుకుంది, ఫైనల్ గా అక్కా చెల్లెళ్ళలో ఎవరిని చేసుకున్నాడనేది తెరమీదే చూడాలి. లైన్ గతంలో చూసిందే కానీ కథ వేరేదే

హర్ష్ మంచి ఈజ్ తో నటించాడు. వయసు చిన్నది కాబట్టి మంచి కథలు పడితే సెటిల్ కావొచ్చు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి అందం ప్లస్ నటన పరంగా ఓకే కానీ భావోద్వేగాల విషయంలో ఇంకొంచెం హోమ్ వర్క్ చేయాలి. దర్శకుడు జ్ఞాన సాగర్ ట్రీట్మెంట్ బాగుంది. ముఖ్యంగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయాలన్న టార్గెట్ తో రాసుకున్న కామెడీ బాగానే పేలింది. కాకపోతే సెకండ్ హాఫ్ తడబాటు కొంత ల్యాగ్ కు దారి తీసింది. మరీ భరించలేనిదిగా లేకపోవడం సెహరికున్న ప్లస్ పాయింట్. ఓ మోస్తరుగా టైం పాస్ అయితే చాలు అనుకుంటే సెహరిని ట్రై చేయొచ్చు. కాకపోతే స్పీడ్ గా దూసుకుపోతున్న టిల్లుని తట్టుకుంటుందో లేదో

Also Read : F.I.R : ఎఫ్ఐఆర్ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి