iDreamPost

బర్రెలక్కకు మద్దతుగా సర్పంచ్ నవ్య.. ఎన్నికల్లో ప్రచారం కూడా..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి బర్రెలక్క పోటీ చేస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం పై ఉంది. ఇక్కడ బర్రెలక్కు భారీగా మద్దతు లభిస్తోంది. తాజాగా సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలిపి.. ఆమె తరపున ఎన్నికల్లో కూడా ప్రచారం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి బర్రెలక్క పోటీ చేస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం పై ఉంది. ఇక్కడ బర్రెలక్కు భారీగా మద్దతు లభిస్తోంది. తాజాగా సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలిపి.. ఆమె తరపున ఎన్నికల్లో కూడా ప్రచారం చేయనున్నారు.

బర్రెలక్కకు మద్దతుగా సర్పంచ్ నవ్య.. ఎన్నికల్లో ప్రచారం కూడా..!

‘హాయ్.. ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్కను’ అంటూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన శిరీష్ ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఆమె పలు కేసులతో  ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.  తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శిరీష అలియాస్ బర్రెలక్క  పోటీ చేస్తున్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో ఆమె ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నారు. ఎంతలా అంటే..ప్రధాన పార్టీలకు సైతం ఆమె గట్టి పోటీ ఇచ్చేలా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఎంతో మంది బర్రెలక్కు సోషల్ మీడియా వేదికగా మద్దుతు తెలుపుతున్నారు. మరికొందరు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతున్నారు. తాజాగా జానకీపురం సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కకు సర్పంచ్ నవ్య మద్దుతు  ఇచ్చారు. అంతేకాక  ప్రచారంలో సైతం పాల్గొంటారని టాక్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచార జోరు పెంచారు. కాగా.. తెలంగాణలో సంచలనంగా మారిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క కూడా ప్రచారం పెద్ద ఎత్తునా చేస్తోంది. ఆమె  ప్రచారానికి నిరుద్యోగుల నుంచి భారీ మద్దతు వస్తోంది. ఈ నేపథ్యంలోనే..తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జనగాం జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలిపారు.

సర్పంచ్ నవ్య.. ఈ పేరు రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్  ఎమ్మెల్యే టి. రాజయ్యపై వేధింపుల ఆరోపణలతో నవ్య ఒక్కసారి వెలుగులోకి వచ్చారు. చాలా రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమెకు సంబంధించిన వార్తలే కనిపించేవి. ఎంతలా అంటే.. ఆమె.. చిన్న సెలబ్రిటీగా మారింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఎన్నికల అధికారులు ఆమెకు వజ్రం గుర్తును కేటాయించగా.. ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తనతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క కూడాకు మద్దతు ప్రకటించారు. కేవలం మద్దతు ప్రకటించటంతో సరిపెట్టకుండా… శిరీష తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. జనగాం జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు పయనమయ్యారు. గురువారం నవ్య మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ముందుకు వచ్చిన బర్రెలక్కకు మద్దతు తెలపాల్సిన అవసరం యువతకు ఉందన్నారు.

అందుకే ఆమె తరుఫున ప్రచారం చేస్తున్నానని నవ్య తెలిపారు. బర్రెలక్కకు కేవలం నిరుద్యోగులు, యువత మాత్రమే కాదు.. అభివృద్ధి కావాలనకునే ప్రతి ఒక్కరు  మద్దతుగా నిలబడాలని సూచించారు. బర్రెలక్కను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని స్థానిక ప్రజలను సర్పంచ్ నవ్య కోరారు. మరి.. శిరీషాకు సర్పంచ్ నవ్య మద్దతు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి