iDreamPost

మహేష్ అభిమానులకి సర్‌ప్రైజ్‌.. ‘సర్కారు వారి పాట’ నుంచి ఆ సాంగ్ రిలీజ్..

మహేష్ అభిమానులకి సర్‌ప్రైజ్‌.. ‘సర్కారు వారి పాట’ నుంచి ఆ సాంగ్ రిలీజ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే కలెక్షన్స్ లో కూడా అదరగొడుతుంది ఈ సినిమా. వీకెండ్ మరో రెండు రోజులు ఉండటంతో ప్రేక్షకులు భారీగా సినిమాకి వెళ్తున్నారు. ఓవర్సీస్ లో కూడా సర్కారు వారి పాట సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తుంది.

తాజాగా మహేష్ అభిమానులకి ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ లాగే ఉండే ఓ సాంగ్ ర్యాప్ వర్షన్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సర్కారు వారి వేట.. పవర్ ఫుల్ మాట.. అంటూ ఈ ర్యాప్ సాంగ్ సాగుతుంది. ఈ ర్యాప్‌ సాంగ్ ని మహా రచించగా తమన్ సంగీత దర్శకత్వంలో శ్రావణ భార్గవి, మహా కలిసి ఆలపించారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ ప్రస్తుతం అధిక వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి