iDreamPost

Sankranthi 1997 Clashes : క్రేజీ సినిమాల పోటీలో మాస్ బొమ్మల విజయం – Nostalgia

Sankranthi 1997 Clashes : క్రేజీ సినిమాల పోటీలో మాస్ బొమ్మల విజయం – Nostalgia

సంవత్సరం ఏదైనా సంక్రాంతికుండే క్రేజే వేరు. ముఖ్యంగా టాలీవుడ్ ఈ సీజన్ కోసం ఎంతగా పరితపిస్తుందో, నిర్మాతలు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు కళ్లజూస్తారో ప్రత్యక్షంగా గమనిస్తూనే ఉన్నాం. ప్రతి ఏడాది చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఈసారి టైం మెషిన్ లో 1997కు వెళదాం. ఆ జనవరిలో పండగ సందడి కొంత త్వరగానే మొదలయ్యింది. 4వ తేదీన చిరంజీవి ‘హిట్లర్’తో శుభారంభం జరిగింది. వరస ఫ్లాపుల తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ముత్యాల సుబ్బయ్య టేకింగ్. చెల్లి సెంటిమెంట్, కమర్షియల్ అంశాలు వెరసి బొమ్మ బ్లాక్ బస్టర్. ముందే వచ్చినా కూడా పూర్తిగా లాభపడింది.

రిస్క్ అయినా పర్లేదు క్లాష్ అవుదాం అనుకుని అదే డేట్ కి వచ్చిన జగపతిబాబు ‘చిలక్కొట్టుడు’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈవివి కామెడీ పాచిక పారలేదు. ఇక జనవరి 10న మహా క్లాష్ జరిగింది. బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’ మరో డ్యూయల్ రోల్ సూపర్ హిట్ ని బాలయ్య ఖాతాలో వేసింది. శరత్ దర్శకత్వం, కోటి పాటలు మాస్ కి బాగా ఎక్కేశాయి. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన మోహన్ బాబు ‘అడవిలో అన్న’ అప్పటి ట్రెండ్ కు తగట్టు కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. వెంకటేష్ ‘చిన్నబ్బాయి’కి దారుణ పరాభవం తప్పలేదు. స్వర్ణకమలం అందించిన కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఇలాంటి చిత్రం ఇచ్చారేమిటా అనే కామెంట్స్ గట్టిగా వచ్చాయి

జనవరి 14న డబ్బింగ్ సినిమా ‘మెరుపు కలలు’ వచ్చింది. అరవింద్ స్వామి-ప్రభుదేవా-కాజోల్ కాంబినేషన్, ఏఆర్ రెహమాన్ సంగీతం అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. కానీ దర్శకుడు రాజీవ్ మీనన్ టెక్నికల్ మేజిక్ అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. కానీ మ్యూజికల్ గా మాత్రం పాటలు అద్భుతంగా అలరించాయి. నాలుగు రోజుల తర్వాత 18న మణిరత్నం ‘ఇద్దరు’లో క్లాస్ టచ్ ఎక్కువైపోయి ఇన్ని మాస్ సినిమాల మధ్య నిలబడలేక ఫ్లాప్ మూటగట్టుకుంది. అదే నెలలో వచ్చిన ఈవివి మరో మూవీ ‘తాళి’ నిరాశపరచగా 30న వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి ‘ఎగిరే పావురమా’ సూపర్ హిట్ తో ఆ నెలను దిగ్విజయంగా ముగిసింది

Also Read : Puli Bebbuli : టైటిల్ కు తగ్గట్టు కృష్ణంరాజు చిరంజీవిల కలయిక – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి