iDreamPost

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో యానిమల్ సత్తా.. ఏకంగా అన్ని అవార్డులతో..!

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటింది. ఏకంగా అన్ని అవార్డులను కైవసం చేసుకుని అదరగొట్టింది.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటింది. ఏకంగా అన్ని అవార్డులను కైవసం చేసుకుని అదరగొట్టింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో యానిమల్ సత్తా.. ఏకంగా అన్ని అవార్డులతో..!

సందీప్ రెడ్డి వంగా ఇది ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆయనొక సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. తీసింది మూడు సినిమాలే అయిన సినీ చరిత్రలో మిగిలిపోయేలా తెరకెక్కించారు సందీప్ రెడ్డి. 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్షన్ లోకి అడుగుపెట్టారు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత కబీర్ సింగ్, ఇటీవల యానిమల్ మూవీతో మరోసారి తన రేంజ్ ఏంటో చూపించారు సందీప్ రెడ్డీ వంగా. తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో యానిమల్ మూవీ సత్తా చాటింది. ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది.

69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం గుజరాత్‌ రాజధాని గాంధీ నగర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల్లో తెలుగు వాడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమిల్’ మూవీ ఉత్తమ నటుడు సహా ఎక్కువ అవార్డులను కైవసం చేసుకొని సత్తా చాటింది.ఇక ‘యానిమల్‌’ చిత్రంలోని నటనకు రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం కేటగిరీలో యానిమల్‌ ఎంపికైంది. యానిమల్ ఉత్తమ నేపథ్య గాయకుడుగా భూపిందర్‌ బాబల్‌ (అర్జన్‌ వెయిలీ) ఎంపికయ్యారు.

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కేటగిరీలో హర్షవర్ధన్‌ రామేశ్వర్‌(యానిమల్), ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ కునాల్‌ శర్మ (సామ్‌ బహదూర్‌) సింక్‌ సినిమా (యానిమల్‌), ఆర్‌.డి. బర్మన్‌ అవార్డ్‌ ఫర్‌ అప్‌ కమింగ్‌ మ్యూజిక్‌ టాలెంట్‌ విభాగంలో శ్రేయ పురాణిక్ (యానిమల్) ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. ఏకంగా 6 అవార్డులతో సందీప్ రెడ్డి వంగా యానిమల్ అదరగొట్టింది. ఇక ‘రాణీ ఔర్ రాఖీకీ ప్రేమ్ కహాని’ మూవీలోని నటనకు ఆలియా భట్ ఎంపికైయింది. అటు ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ మూవీ ఎంపికైయింది.

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లిస్టు

  • ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌
  • ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • *ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
  • *ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌
  • *ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)
  • ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • *ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవినాశ్‌ అరుణ్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుభ్రతా చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (సామ్‌ బహదూర్‌)
  • ఉత్తమ ఎడిటింగ్‌: జస్కున్వర్‌ సింగ్‌ కోహ్లీ, విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్‌, నిధి గంభీర్‌ (సామ్‌ బహదూర్‌)
  • *ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: కునాల్‌ శర్మ (సామ్‌ బహదూర్‌), సింక్‌ సినిమా (యానిమల్‌)
  • ఉత్తమ కొరియోగ్రఫీ: గణేశ్‌ ఆచార్య (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ యాక్షన్‌: స్పిరో రజాటోస్, అనల్‌ అరసు (జవాన్‌)
  • ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: రెడ్‌ చిల్లీస్‌ వీఎఫ్‌ఎక్స్‌ (జవాన్‌)
  • ఉత్తమ నూతన దర్శకుడు: తరుణ్ దుడేజా (ధక్ ధక్‌)
  • ఉత్తమ నూతన నటుడు: ఆదిత్య (ఫరాజ్)
  • ఉత్తమ నూతన నటి: అలిజే అగ్నిహోత్రి (ఫారే)
  • జీవిత సాఫల్య పురస్కారం: డేవిడ్‌ ధావన్‌
  • *ఆర్‌.డి. బర్మన్‌ అవార్డ్‌ ఫర్‌ అప్‌ కమింగ్‌ మ్యూజిక్‌ టాలెంట్‌: శ్రేయ పురాణిక్ (యానిమల్)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి