iDreamPost

Salaar: కలెక్షన్స్​లో ‘డంకీ’ని తొక్కిపడేసిన ‘సలార్’! ఇదీ ప్రభాస్ రేంజ్..

  • Published Dec 20, 2023 | 3:47 PMUpdated Dec 20, 2023 | 3:47 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దూకుడు మామూలుగా లేదు. రిలీజ్​కు ముందే ‘సలార్’తో ఆయన కొత్త రికార్డులు పెడుతున్నారు. డార్లింగ్ మూవీ దెబ్బకు కింగ్ ఖాన్ షారుక్ నటించిన ‘డంకీ’ చిత్రం షేక్ అవుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దూకుడు మామూలుగా లేదు. రిలీజ్​కు ముందే ‘సలార్’తో ఆయన కొత్త రికార్డులు పెడుతున్నారు. డార్లింగ్ మూవీ దెబ్బకు కింగ్ ఖాన్ షారుక్ నటించిన ‘డంకీ’ చిత్రం షేక్ అవుతోంది.

  • Published Dec 20, 2023 | 3:47 PMUpdated Dec 20, 2023 | 3:47 PM
Salaar: కలెక్షన్స్​లో ‘డంకీ’ని తొక్కిపడేసిన ‘సలార్’! ఇదీ ప్రభాస్ రేంజ్..

డైనోసార్ వచ్చేస్తోంది. ఇంకా రెండ్రోజులు ఆగితే చాలు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాస్ యాక్షన్​ అవతార్​ను థియేటర్లలో చూసేయొచ్చు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘సలార్’ డిసెంబర్ 22న బిగ్​స్క్రీన్స్​లో రిలీజ్ కానుంది. డార్లింగ్ అభిమానులతో పాటు మూవీ గోయర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ‘సలార్’ టికెట్ల బుకింగ్స్ మొదలైపోయాయి. తొలుత యూఎస్​తో పాటు పలు ఫారెన్ కంట్రీస్​లో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు తెలుగు నాట కూడా బుకింగ్స్ షూరూ అయ్యాయి. ‘సలార్​’కు పోటీగా బాలీవుడ్​ బాద్​షా షారుక్ నటించిన ‘డంకీ’ కూడా శుక్రవారమే బాక్సాఫీస్​ దగ్గరకు వస్తోంది. అయితే ఆ సినిమాతో పోటీ ఉంటుందని అనుకుంటే.. దానికి ప్రభాస్ అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ‘డంకీ’ని తొక్కిపడేస్తోంది ‘సలార్’.

ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినప్పటికీ ఆయన మూవీకి సౌత్​లో ఎక్కువ క్రేజ్ ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ ఉత్తరాదిన కూడా ఆయన పాపులారిటీ అదే లెవల్లో ఉందని ‘సలార్’ మరోమారు ప్రూవ్ చేసింది. టికెట్ సేల్స్​ విషయంలో షారుక్ ‘డంకీ’ని ప్రభాస్ మూవీ బీట్ చేయడమే దీనికి ప్రూఫ్​. రిలీజ్ డే అడ్వాన్స్ ఓపెనింగ్ సేల్స్​లో ‘డంకీ’ని తొక్కిపడేసింది ‘సలార్’. ప్రభాస్ ఫిల్మ్​కు నేషనల్ చైన్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్​తో పాటు పాన్ ఇండియా ఆల్ థియేటర్స్ కలిపి అడ్వాన్స్ సేల్స్​గా టోటల్ గ్రాస్ రూ.13.66 కోట్లు వచ్చింది. అదే ‘డంకీ’కి మాత్రం ఈ నేషనల్ చైన్స్​తో పాటు అన్ని థియేటర్లకు కలుపుకోగా కేవలం రూ.10.70 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్​బస్టర్స్ కొట్టిన షారుక్ కంటే ప్రభాస్ సినిమాకు గ్రాస్ ఎక్కువగా వచ్చింది. దీన్ని బట్టే పాన్ ఇండియా మార్కెట్​లో డార్లింగ్ క్రేజ్ ఏ లెవల్లో ఉందో, ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

‘సలార్’పై యూఎస్​తో పాటు ఇతర ఫారెన్ కంట్రీస్​లో నెక్స్ట్ లెవల్లో బజ్ క్రియేట్ అయింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే అక్కడ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత నార్త్ ఇండియాలో టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా అక్కడ కూడా ఇదే పరిస్థితి. కొన్ని గంటల ముందే తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ బుకింగ్స్ తెరిచారు. పలు చోట్ల థియేటర్లలో నేరుగా టికెట్లను అమ్మగా.. ఫ్యాన్స్​ భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. డార్లింగ్ అభిమానుల దెబ్బకు టికెట్లను అమ్ముతున్న బుకింగ్ మై షో యాప్ సర్వర్ క్రాష్ అయింది. ఉత్తరాదిన చాలా చోట్ల ‘డంకీ’ కంటే టికెట్ సేల్స్​లో ‘సలార్’ చాలా ముందంజలో ఉంది. రిలీజ్​కు ముందే సిచ్యువేషన్ ఇలా ఉంటే.. విడుదలయ్యాక హిట్ టాక్ వస్తే ప్రభాస్ ఫిల్మ్ ముందు షారుక్ సినిమా నిలబడటం చాలా కష్టం. మరి.. అన్ని విషయాల్లోనూ ‘డంకీ’ని ‘సలార్’ తొక్కిపడేస్తూ దూసుకెళ్లడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Dunki Vs Salaar: రాజ్ కుమార్ హిరానీ vs ప్రశాంత్ నీల్! ఇద్దరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి