iDreamPost

Salaar : బాహుబలి రూటులోనే ప్రభాస్ మూవీ

Salaar : బాహుబలి రూటులోనే ప్రభాస్ మూవీ

కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఇండియన్ మ్యాచో స్టార్ ప్రభాస్ హీరో కావడంతో రిలీజ్ టైంకి హైప్ ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించుకోవడం కూడా కష్టమే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సగానికి పైగానే అయిపోయింది. ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదు కానీ దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాని ప్రకారం సలార్ రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారట. ఆ స్కోప్ ఉండటంతో పాటు బాహుబలిలా దీన్ని ప్రమోట్ చేసుకుంటే వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేశారట.

ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు ఖరారైనట్టేనని సమాచారం. ఇప్పుడిలా హఠాత్తుగా అనుకోవడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే పుష్ప పార్ట్ 1 కి నార్త్ లో వచ్చిన సక్సెస్ చూశాక సీక్వెల్ మీద అమాంతం క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కు క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. గొప్పగా లేకపోయినా దర్శకుడు సుకుమార్ కథను తీర్చిదిద్దిన విధానం, ఎలివేషన్లు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దెబ్బకు పార్ట్ 2 ఎప్పుడు వస్తుందాని సెలబ్రిటీలు సైతం ట్వీట్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో సుకుమార్ ఇప్పుడు కొన్ని కీలక మార్పులతో రెండో భాగానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు.

దీనికన్నా ముందే టాలీవుడ్ లో నెగటివ్ సీక్వెల్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది బాహుబలినే. వన్ కన్నా ఎక్కువగా టూ బ్లాక్ బస్టర్ కావడం ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు పుష్ప కూడా అదే దారిలో వెళ్తోంది కాబట్టి సలార్ కూడా ఆ దిశగానే ఫిక్స్ అయ్యినట్టు ఉంది. మొత్తానికి ఒకే కథ ఒకే టీమ్ తో డబుల్ బిజినెస్ రెట్టింపు లాభాలు అందుకునే ఈ రెండు భాగాల ఎత్తుగడ రాబోయే రోజుల్లో ఒక ట్రెండ్ గా మారినా ఆశ్చర్యం లేదు. రాధే శ్యామ్ విడుదల కోసం ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఆది పురుష్ కన్నా ముందు సలార్ వస్తుంది. కాకపోతే తేదీల విషయంలో ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు

Also Read : Keerthy Suresh : వరస పొరపాట్లకు కీర్తి సురేష్ మూల్యం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి