iDreamPost

Sai Pallavi : భానుమతి చెల్లెలి వెండితెర ప్రవేశం

Sai Pallavi : భానుమతి చెల్లెలి వెండితెర ప్రవేశం

మలయాళీ అయినప్పటికీ సాయిపల్లవికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ఎంత ఫాలోయింగ్ ఉందో చూస్తూనే ఉన్నాం. మొన్న లవ్ స్టోరీ రిలీజైనప్పుడు థియేటర్ల దగ్గర నాగ చైతన్యకు ధీటుగా తనకూ ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు పడ్డాయి. ముఖ్యంగా బిసి సెంటర్లలో తన ఎంట్రీకి ఈలలు గోలలతో ఫ్యాన్స్ మాములు రచ్చ చేయలేదు. రాబోయే విరాట పర్వంని రానా కంటే ఎక్కువగా తన పేరు మీద మార్కెటింగ్ చేయబోతున్నారనే వార్త చాలు ఈమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకునేందుకు. సాయిపల్లవికి తనలాగే అనిపించే పోలికలతో ఉన్న స్వంత చెల్లెలు సోషల్ మీడియా వాడకం దార్లకు పరిచయమే. అక్కాచెల్లెళ్ల ఫోటోలు తరచుగా దర్శనమిస్తుంటాయి.

ఆ అమ్మాయి పేరు పూజా కన్నన్. గప్ చుప్ గా వెండితెర ఎంట్రీ జరిగిపోతోంది. తమిళంలో ఫైట్ మాస్టర్ సెల్వా దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిన సిత్రై సెవ్వానం ఈ నెల సోనీ లివ్ ద్వారా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకోబోతోంది. సముతిరఖని ప్రధాన పాత్రలో నటించడం విశేషం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్స్ ని హై లైట్ చేస్తూ తండ్రికూతుళ్ళ కథగా దీన్ని రూపొందించారు. ముందు థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ అధిక శాతం ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో డిజిటల్ కు వెళ్లిపోయారు. సో పూజా కణ్ణన్ ని నేరుగా చిన్నితెర మీద చూడబోతుండటం అక్కను సైతం ఎగ్జైట్ చేస్తోంది.

సోదరి సక్సెస్ అయ్యాక చెల్లి ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నదే. కన్నడ కం తెలుగు హీరోయిన్ మాలాశ్రీ స్టార్ అయ్యాక చెల్లి భాగ్యశ్రీని తెరకు పరిచయం చేసింది. నగ్మా పెద్ద రేంజ్ కు చేరుకున్నాక జ్యోతిక, రోషిణి వచ్చారు. కాజల్ అగర్వాల్ సైతం నిషాని తీసుకొచ్చినా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రాధిక-నిరోషా, రాధా-అంబికా, షామిలి-షాలిని ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. పోస్టర్లు టీజర్లు చూస్తే అక్కకు తగ్గట్టే చెల్లి కూడా రాణించేలా కనిపిస్తోంది. మొదటి సినిమానే ఇలాంటి కథను ఎంచుకోవడంలో టేస్ట్ కనిపిస్తోంది

Also Read : November 26th Releases : నవంబర్ 26 సినిమాల జాతర

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి