iDreamPost
android-app
ios-app

బాక్సాఫీస్ షేక్ చేసిన ఇన్స్ పెక్టర్ – Nostalgia

  • Published May 08, 2021 | 11:29 AM Updated Updated May 08, 2021 | 11:29 AM
బాక్సాఫీస్ షేక్ చేసిన ఇన్స్ పెక్టర్ – Nostalgia

మాస్ లో బలమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలతో సరైన కథలను సరైన రీతిలో చూపించాలే కానీ వసూళ్ల వర్షం ఖాయమని బాక్సాఫీస్ చాలా సార్లు ఋజువు చేసింది. అలా అని వాళ్ళతో గుడ్డిగా ఏది బడితే అది తీస్తే హిట్ అవుతుందనుకుంటే కూడా తప్పే. ఇక్కడ కమర్షియల్ అంశాల కొలతలు చాలా ముఖ్యం. ఒక ఉదాహరణ చూద్దాం. 1992 సంవత్సరం. ‘ముద్దుల మావయ్య’ లాంటి ఫ్యామిలీ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించాక బాలయ్యకు కొన్ని ఒడిదుడుకులు తప్పలేదు. ‘అశోక చక్రవర్తి’ ఫ్లాప్ అయ్యింది. ‘బాలగోపాలుడు’ పర్వాలేదనిపించుకోగా ‘నారి నారి నడుమ మురారి’ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది కానీ మాస్ కి కిక్ ఇవ్వలేదు. ‘ముద్దుల మేనల్లుడు’ ఫలితమూ ఫ్లాపే.

ఆ సమయంలో దర్శకుడు బి గోపాల్ తో మొదటిసారి చేసిన ‘లారీ డ్రైవర్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. వంద రోజులు కలెక్షన్లతో కళకళలాడించింది.ఆపై ‘తల్లితండ్రులు’ సోసోగా ఆడితే నాన్న ఎన్టీఆర్ తో నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వారానికే బ్యాక్ బౌన్స్ అయ్యింది. ‘ఆదిత్య 369’ విమర్శకుల ప్రశంసలు అందుకోగా ‘ధర్మక్షేత్రం’ మళ్ళీ వెనక్కు లాగింది. ఆ సమయంలో రచయిత ఆంజనేయ పుష్పానంద్ రాసిన కథ ఒకటి బి గోపాల్ కి బాగా నచ్చింది. వెంటనే పరుచూరి బ్రదర్స్ ని వెంట తీసుకుని బాలయ్య దగ్గరకు వెళ్లిపోయారు. అప్పటికే విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ టి త్రివిక్రమరావుకు బాలకృష్ణ కమిట్ మెంట్ ఇచ్చి ఉన్నారు. స్టోరీ అనుకున్నప్పుడు టీమ్ మధ్య చాలా చర్చలు జరిగాయి. అప్పుడు రూపుదిద్దుకున్నదే ‘రౌడీ ఇన్స్ పెక్టర్’

1989లో తెలుగు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన ‘అంకుశం’లో రాజశేఖర్ ని చూశాక వేరే హీరోని పోలీస్ ఆఫీసర్ గా జనం చూడగలరా అనే అనుమానం ఇండస్ట్రీలోనే ఉండేది. అయితే అందులో హీరో పాత్ర ఆవేశంగా ఆవేదనగా ఒకరకంగా చెప్పాలంటే పాసివ్ గా ఉంటుంది. అందుకే పరుచూరి సోదరులు రామరాజు క్యారెక్టర్ ని ఫెరోషియస్ గా తీర్చిదిద్దారు. తేడా వస్తే రౌడీలకు రౌడీగా డీల్ చేసే విధానం అద్భుతంగా సెట్ అయ్యింది. థియేటర్లు ఊగిపోయే రేంజ్ లో బప్పీలహరి స్వరపరిచిన పాటలు ఆడియో సేల్స్ లో రికార్డులు సృష్టించాయి. విజయశాంతి, హరీష్, నిర్మలమ్మ, మోహన్ రాజ్, కోట, కెప్టెన్ రాజు ఒకదాన్ని మించి మరొక పాత్రలు బాగా పండాయి. 1992 మే 7 విడుదలైన రౌడీ ఇన్స్ పెక్టర్ 34 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడటం ఆ టైంలో సూపర్ రికార్డు